☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

NEET-PG 2026 Results : నీట్ పీజీ- 2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్, స్కోర్ ఇలా చెక్ చేసుకోండి.. కటాఫ్ మార్కులు ఇవే.

NEET-PG 2026 Results : వైద్య విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నీట్ పీజీ (NEET PG 2026) ఫలితాలు విడుదలయ్యాయి.
NEET-PG 2026 Results : నీట్ పీజీ- 2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్, స్కోర్ ఇలా చెక్ చేసుకోండి.. కటాఫ్ మార్కులు ఇవే.

NEET-PG 2026 Results : వైద్య విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నీట్ పీజీ (NEET PG 2026) ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) గురువారం మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు సాధించిన స్కోర్‌తో పాటు వారి నీట్ పీజీ – 2026 ర్యాంకును కూడా వెల్లడించింది.

Also Read : Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్ చేసిన ధర్మాసనం.. ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ ఫిక్స్!

నీట్ పీజీ -2026 పరీక్షను ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నిర్వహించారు. వివిధ ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, DrNB (డైరెక్ట్ 6 ఇయర్స్ కోర్సులు), PG మెడికల్ డిప్లొమా కోర్సుల్లో 2026-27 అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 30న మొత్తం 2,63,544 మంది పరీక్షకు హాజరయ్యారు. జైపూర్‌లోని రెండు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కారణంగా పరీక్ష పూర్తి చేయలేకపోయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 5న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఆ పరీక్షకు మరో 2,416 మంది అభ్యర్థులు హాజరైనట్లు బోర్డు తెలిపింది. అయితే, తాజాగా.. అభ్యర్థుల అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్, రోల్ నంబర్, సాధించిన స్కోరు, నీట్ పీజీ – 2026 ర్యాంకులతో కూడిన ప్రత్యేక జాబితాతోపాటు కటాఫ్ స్కోరును కూడా విడుదల చేసింది.

NBEMS ప్రకటించిన వివరాల ప్రకారం.. కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ కటాఫ్ ..
♦ General/EWS: 50వ పర్సంటైల్.. 262 మార్కులు
♦ General PwBD: 45వ పర్సంటైల్.. 244 మార్కులు
♦ SC/ST/OBC (PwBD సహా): 40వ పర్సంటైల్.. 226 మార్కులు
అయితే, ఈ కటాఫ్ మార్కులు నీట్ పీజీలో అర్హత సాధించేందుకు అవసరమైన కనీస స్కోర్లు. అయితే కటాఫ్ సాధించడం ద్వారా ఏదైనా నిర్దిష్ట మెడికల్ కాలేజీ లేదా స్పెషాలిటీ సీటు ఖరారైనట్లు కాదు. సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్ సమయంలో ర్యాంకు, కేటగిరీ, కోర్సు, కాలేజీ, కోటా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అక్టోబర్ 1 నుంచి స్కోర్‌కార్డులు, ఆన్సర్ కీ..
అభ్యర్థుల వ్యక్తిగత నీట్ పీజీ -2026 స్కోర్‌కార్డులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎన్బీఈఎంఎస్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కోర్‌కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల పాటు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్బీఈఎంఎస్ తెలిపింది. అందువల్ల అభ్యర్థులు వాటిని భద్రపరచుకోవాలని సూచించింది. అదేవిధంగా ఆన్సర్ కీని కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎన్బీఈఎంఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ప్రశ్న ఐడీలు, సరైన ఆన్సర్ కీ ఐడీలు, తాము ఇచ్చిన సమాధానాలు, ప్రతి ప్రశ్నకు లభించిన స్కోర్ వంటి వివరాలను పరిశీలించవచ్చు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫలితాల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ద్వారా ఎండీ/ఎంఎస్ తదితర పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jio vs Airtel vs Vi : డేటా వద్దు.. ఫోన్ కాల్స్, SMS చాలు.. Jio, Airtel, Viలో చౌకైన కొత్త రీఛార్జ్ ఆప్షన్లు!Mivi One Smartphone : మివి నుంచి ఫస్ట్ 5G ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ రూ. 15వేల లోపే.. ఫీచర్లు మాత్రం కేక..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com