☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సెలబ్రిటీలకే ప్రత్యేక ఓటరు సేవలా? ఈసీ 'వీఐపీ ఓటర్' విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత

సెలబ్రిటీలకే ప్రత్యేక ఓటరు సేవలా? ఈసీ 'వీఐపీ ఓటర్' విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత
సెలబ్రిటీలకే ప్రత్యేక ఓటరు సేవలా? ఈసీ 'వీఐపీ ఓటర్' విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత
సెలబ్రిటీలకే ప్రత్యేక ఓటరు సేవలా? ఈసీ 'వీఐపీ ఓటర్' విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం కొత్తగా 'వీఐపీ ఓటర్' అనే పదాన్ని తెరపైకి తెస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో దేశ ప్రధాని మొదలుకుని సామాన్య కూలీ, రైతు వరకు అందరి ఓట్ల విలువ సమానమే అని మనం పాఠశాలల్లో నేర్చుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కేవలం వీఐపీలకు ప్రత్యేక సేవలు అందించడమే కాకుండా.. వారిని 'వీఐపీ ఓటర్లు'గా గుర్తిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ద పెద్ద అధికారులు, సిబ్బంది నేరుగా సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి SIR జాబితా నుంచి తొలగించబడిన వారి ఓట్లను తిరిగి నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నారు. అదే సమయంలో సాధారణ పేదలు, మధ్యతరగతి ప్రజలు, వృద్ధులు మాత్రం తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి రోజువారీ కూలీ పనులు మానుకుని క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వారి ఇళ్లకు వెళ్లి సహాయం చేసేవారు కరవయ్యారనే ఆవేదన వ్యక్తమవుతోంది.

ఈ విధానం నోట్ల రద్దు నాటి పరిణామాలను గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆ సమయంలో సామాన్య ప్రజలు బ్యాంకు బయట బారులు తీరితే, ధనవంతులకు మాత్రం ఇంటి వద్దకే ప్రత్యేక సేవలు అందాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలోనూ అదే ధోరణి రిపీట్ అవుతోందని, ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్పూర్తికి తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉంటుందనే ప్రాథమిక సూత్రానికి ఇది విరుద్ధంగా మారుతోంది.

దేశంలోని కోట్ల మంది పౌరుల ఓటు హక్కును కాపాడటానికి సుప్రీంకోర్టు ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. న్యాయస్థానం స్పందించకపోతే సామాన్యుల పౌరసత్వ హక్కులు ప్రమాదంలో పడతాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే ఈ పద్ధతికి ఎలక్షన్ కమిషన్ స్వస్తి పలకాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

⬇ Full News JPG⬇ Short News JPG
← ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు..? అసలు విషయం బయటపెట్టిన ఈసీPGIMERలో నర్స్ ఉద్యోగాలు.. అనుభవం ఉంటే చాలు.. జాబ్ కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com