Oil Price : నిత్యావసర ధరల భారాన్ని ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వంటనూనెల ధరలను అదుపులోకి తెచ్చే లక్ష్యంతో ముడి (Crude), మరియు రిఫైన్డ్ (Refined) వంటనూనెలపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (Basic Customs Duty – BCD) తగ్గించింది. అందులో భాగంగా ముడి సోయాబీన్, పామ్ ఆయిల్స్‌పై ఉన్న 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించగా, రిఫైన్డ్ సోయాబీన్ మరియు పామ్ ఆయిల్స్‌పై ఉన్న సుంకాన్ని 32.7 శాతం నుండి 27.5 శాతానికి తగ్గించింది. పండుగల సీజన్ మరియు నిత్య జీవితంలో ప్రజలకు అత్యంత ముఖ్యమైన వంటనూనెలపై పన్ను తగ్గించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సన్ ఫ్లవర్ ఆయిల్ ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా పన్ను మినహాయింపు
ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే సన్ ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) నూనెపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఊరట చర్యలు చేపట్టింది. ముడి సన్ ఫ్లవర్ ఆయిల్‌పై ఇప్పటివరకు ఉన్న 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా (0 శాతానికి) రద్దు చేయగా, రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాన్ని 32.5 శాతం నుండి ఏకంగా 22.5 శాతానికి తగ్గించింది. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల మార్కెట్లో వంటనూనెల లభ్యత పెరిగి, హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో గృహిణులకు, కుటుంబ బడ్జెట్‌కు భారీ ఉపశమనం లభించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం


