AP Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షాల తీరును, తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలను ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

తీరం దాటే ప్రాంతం మరియు ఈదురుగాలుల తీవ్రత
ఈ తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం మరియు కవిటి ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు సుమారు 85 కిలోమీటర్ల వేగంతో ప్రమాకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అంచనాలను స్పష్టం చేశారు.
Read also: Chandrababu Naidu: అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
AP Weather Alert: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు
వాయుగుండం ప్రభావం వల్ల శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఇతర ప్రాంతాలు
ఉత్తర కోస్తాతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏటువంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రాణనష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్






