☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఆకతాయిలు రిజర్వాయర్‌ గేటును ఎత్తేశారు..ఊరంతా జలమయం

Gorakallu Reservoir : నంద్యాల జిల్లా గోరకల్లు రిజర్వాయర్‌ గేటును గుర్తు తెలియని ఆకతాయిలు ఎత్తేశారు. వెంటనే గోరుకల్లు గ్రామంలోకి నీటి ప్రవాహం పోటెత్తింది. కట్ట తెగిందన్న...
ఆకతాయిలు రిజర్వాయర్‌ గేటును ఎత్తేశారు..ఊరంతా జలమయం

Gorakallu Reservoir : నంద్యాల జిల్లా గోరకల్లు రిజర్వాయర్‌ గేటును గుర్తు తెలియని ఆకతాయిలు ఎత్తేశారు. వెంటనే గోరుకల్లు గ్రామంలోకి నీటి ప్రవాహం పోటెత్తింది. కట్ట తెగిందన్న ప్రచారంతో గ్రామస్థుల పరుగులు తీశారు.. వెంటనే వారంతా పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అయితే స్థానికంగా ఉండే ఎలక్ట్రీషియన్‌ అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పిపోయింది. ఆయన ఓటీ రెగ్యులేటర్‌ దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనికి ఊరు మొత్తం నీట మునిగింది. ఒక్కసారిగా రిజర్వాయర్ నుంచి నీళ్లు పోటెత్తడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే ఉన్న కొండపైకి ఎక్కారు. గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ అప్రమత్తంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో గోరుకల్లు రిజర్వాయర్‌ ఔట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ ఉంది.. దీనికి ఓ గేటు ఏర్పాటు చేశారు. మంగళవారం వేకువజామున సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు ఎత్తడంతో ఒక్కసారిగ గోరుకల్లులోకి వరద నీరు పోటెత్తింది.

Read Also: AP : మహిళలను చంద్రబాబు మోసం చేసారంటూ పేర్ని నాని ఫైర్

Gorakallu Reservoir
Gorakallu Reservoir

Gorakallu Reservoir : వరద నీరును చూసి జనాలు భయంతో పరుగులు

ఒక్కసారిగా వరద నీరు రావడంతో జనాలు రిజర్వాయర్ కట్టి తెగిపోయిందని భయపడ్డారు. వరద నీరును చూసి జనాలు భయంతో పరుగుల తీశారు.. పక్కనే ఉన్న కొండపైకి వెళ్లి నిలబడ్డారు. అప్పటికి కరెంట్ లేదు, వాన కూడా కురుస్తోంది. పిల్లలు, పెద్దలు దాదాపు వెయ్యిమంది అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత కట్ట తెగలేదని తెలిసి తిరిగి వచ్చారు . గేటు ఎత్తిన సమయంలో రిజర్వాయర్‌లో 9.5 టీఎంసీల నీరు ఉండగా.. గేటు ఎత్తిన తర్వాత మూడువేల క్యూసెక్కులకుపైగా నీరు బయటకు వెళ్లాయి. ఒక్కసారిగా ఎస్సార్బీసీ కాలువలోకి నీళ్లు రావడంతో ఆ స్పీడ్‌కు కాలువ కాంక్రీటుకట్టకు ఆనుకుని ఉన్న మట్టికట్ట కొట్టుకుపోయింది. ఈ నీళ్లు పం పొలాలతో పాటుగా రోడ్లను ముంచెత్తాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అన్నదాన కార్యక్రమంలో విషాదం.. సాంబారు పాత్రలో పడి మహిళ మృతి



⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఎట్టకేలకు జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదలస్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com