Hyderabad Ganesh Laddu Auction: హైదరాబాద్ నగరంలో గణేశ్ లడ్డూ వేలం పాటలు మరోసారి సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలిచాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘కీర్తి రిచ్‌మండ్ గేటెడ్ కమ్యూనిటీ’లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వేలంలో గణపతి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ.1.01 కోట్ల భారీ ధర పలికింది. ప్రతి ఏటా పోటాపోటీగా సాగే ఈ వేలంలో ఈసారి ‘శక్తిమాన్’ బృంద సభ్యులు తీవ్ర పోటీ మధ్య లడ్డూను కైవసం చేసుకున్నారు.
Read Also : Telangana: ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్

Hyderabad Ganesh Laddu Auction: ఉత్కంఠభరితంగా సాగిన పోటీ
కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలానికి నగరంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కమ్యూనిటీ నివాసితులు ప్రతి ఏటా నాలుగు గ్రూపులుగా విడిపోయి లడ్డూ ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు. ఈసారి కూడా అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పాటలో శక్తిమాన్ బృందం విజయం సాధించింది. గత ఏడాది (2025) ఇదే కమ్యూనిటీలో లడ్డూ రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలకడం విశేషం. ఆ రికార్డుతో పోలిస్తే ఈసారి ధర కాస్త తగ్గినా, మళ్లీ కోటి రూపాయల మార్క్‌ను దాటడం విశేషం.
అందరి దృష్టి ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూపైనే
గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ ధరలు కోట్లలో పలుకుతుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపై కేంద్రీకృతమైంది. రేపు ఈ చారిత్రక బాలాపూర్ లడ్డూ వేలం జరగనుంది. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం నేడు లక్షల రూపాయలకు చేరింది.
గత ఏడాది బాలాపూర్ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకోగా, 2024లో రూ.30.01 లక్షలు పలికింది. ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనా మండపంలో కొలువైన 21 కిలోల బాలాపూర్ గణపయ్య లడ్డూ కొత్త రికార్డు సృష్టిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం పూర్తయిన తర్వాతే నగరంలో గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడం ఆనవాయతీగా వస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
గణేష్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు






