☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?

Telangana Airports: తెలంగాణలోని వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పేర్ల ఖరారుపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ప్రజాభిప్రాయాలు, వివిధ వర్గాల...
మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?

Telangana Airports: తెలంగాణలోని వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పేర్ల ఖరారుపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ప్రజాభిప్రాయాలు, వివిధ వర్గాల సూచనలను విస్తృతంగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ రెండు విమానాశ్రయాలకు ప్రముఖ చారిత్రక, పోరాట యోధుల పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురం భీం పేర్లను నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Read Also : Nerella Sharada: మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. నేడు ప్రమాణ స్వీకారం

Telangana Airports
Names finalized for Mamunur and Adilabad airports?

Telangana Airports: కేబినెట్ ఆమోదం, కేంద్రానికి ప్రతిపాదనలు

ఈ పేర్ల ఖరారుకు సంబంధించిన ఫైలును త్వరలోనే నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశంలో ప్రతిపాదించనున్నారు. కేబినెట్ అధికారిక ఆమోదం పొందిన వెంటనే, ఇదే పేర్లను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అధికారిక లేఖ రాయనుంది. కేంద్రం నుండి అనుమతి లభించిన అనంతరం రెండు విమానాశ్రయాల పేర్లతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు ‘అల్లూరి సీతారామరాజు’, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేర్లు పెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా సమీక్షలో చర్చించారు. తెలంగాణకు వచ్చే విదేశీ ప్రతినిధులకు, పర్యాటకులకు రాష్ట్ర గొప్ప చరిత్ర, మహనీయుల పోరాట పటిమ తెలియజెప్పేలా ఈ పేర్లు ఎంతో ఉపకరిస్తాయని భావించారు. మామునూరు ఎయిర్‌పోర్టు కోసం ‘సమ్మక్క-సారలమ్మ’ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ, తుది చర్చల అనంతరం ‘రాణి రుద్రమ’ పేరు వైపే మొగ్గు చూపారు.

అద్భుతమైన డిజైన్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు

మరోవైపు ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల డిజైన్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానాశ్రయాల ఆకృతులు సాధారణంగా కాకుండా, తెలంగాణ సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను సీఎం గట్టిగా ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బీహార్‌లో మరో దారుణం: యువతిపై కొందరు వ్యక్తుల లైంగిక దాడి‘ప్యారడైజ్’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది -నిర్మాత రవిశంకర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com