Narsingh Student Dead Case : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న హరిణి అనే యువతి తన ఇంటి వెనుక చెత్తకుప్పలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో పాటు దుస్తులు లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని, యువతి నిరాకరించడంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు, బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో వరుసగా నర్సింగ్ విద్యార్థినులు హత్యకు గురికావడంపై దళిత, ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించగా, స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Adilabad RIMS : ఆదిలాబాద్ రిమ్స్ పిల్లల వార్డులో ఏసీ పేలిన ఘటన – ఐదుకు చేరిన మృతులు

Narsingh Student Dead Case : అతడిపైనే అనుమానం : యువతి తల్లి
హరిణిది కచ్చితంగా హత్యగానే బంధువులు, కుటుంబసభ్యులు బలంగా చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని, యువతి నిరాకరించడంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్న యువకుడు సైతం పరారీలో ఉండటంతో అతడే హత్య చేసి ఉంటాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హరిణి మృతదేహం శవపరీక్షకు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలు రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. జిల్లాలో వరుస హత్యల పట్ల నిరసనలు వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళనకారుల వద్దకు చేరుకుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నిమజ్జన వేడుకల్లో విషాదం..నదిలో గల్లంతైన ఐదుగురు మృతి






