☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇందిరమ్మ టవర్స్‌తో పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో సొంతిల్లు

Indiramma Towers : హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. నగరంలోని...
ఇందిరమ్మ టవర్స్‌తో పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో సొంతిల్లు

Indiramma Towers : హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వినియోగించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడంతో లబ్ధిదారులకు ఇల్లు మాత్రమే కాకుండా విలువైన ప్రాంతంలో ఆస్తి హక్కు కూడా లభించే అవకాశం ఏర్పడుతోంది. ఇందిరమ్మ టవర్స్‌ కోసం ఎంపిక చేసిన పలు ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ గణనీయంగా ఉంది. రాయదుర్గం, కూకట్‌పల్లి, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌ పరిసరాలు, నాంపల్లి, సనత్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.లక్షకు పైగా పలుకుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులకు లభించే ఫ్లాట్‌ భవిష్యత్‌లో విలువైన ఆస్తిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ టవర్‌ ఫ్లాట్‌ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ఒక్కో ప్రాంతంలో సుమారు 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. స్థల విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో లబ్ధిదారుడికి 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్‌ షేర్‌ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Jharkhand Drowning Incident: నిమజ్జన వేడుకల్లో విషాదం..నదిలో గల్లంతైన ఐదుగురు మృతి

Indiramma Towers
Indiramma Towers

Indiramma Towers : తొలి దశలో 7,680 ఇళ్లు

తొలి దశలో 16 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులకు శంకుస్థాపన జరగగా, మిగతా ప్రాంతాల్లోనూ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్‌డివైడెడ్‌ షేర్‌, నిర్మాణ వ్యయాన్ని కలిపి చూస్తే ఒక్కో ఫ్లాట్‌ విలువ గణనీయంగా ఉండనుంది. ఉదాహరణకు 18 గజాల భూమి వాటా వస్తే, గజానికి రూ.లక్ష చొప్పున భూమి విలువ సుమారు రూ.18 లక్షలు అవుతుంది. ఫ్లాట్‌ నిర్మాణానికి మరో రూ.15 లక్షలు కలిపితే మొత్తం విలువ దాదాపు రూ.33 లక్షలు అవుతుంది. ఈ లెక్కన తొలి దశలో నిర్మించనున్న 7,680 ఫ్లాట్ల మొత్తం అంచనా విలువ సుమారు రూ.2,534 కోట్లుగా ఉంటుంది. నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉపాధి కోసం ప్రతిరోజూ ప్రయాణాలు చేసే పేద కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్‌ ద్వారా ప్రత్యేక ప్రయోజనం కలగనుంది. పని చేసే ప్రాంతానికి సమీపంలోనే ఇల్లు లభిస్తే అద్దె భారం తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు, ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల్లో స్థానికుల సంఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియపై చర్చ జరుగుతోంది. స్థానికంగా అర్హత ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం కల్పించేలా మరోసారి పరిశీలన లేదా లాటరీ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ప్రాంక్‌ పేరుతో ప్రమాదకర చర్య.. యువకుడికి తీవ్ర గాయాలుసందీప్ కిషన్ ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com