☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Ashwin Comments on BCCI: భారత క్రికెటర్ల గాయాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల గాయాల నిర్వహణపై ప్రశ్నలు...
బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Ashwin Comments on BCCI: భారత క్రికెటర్ల గాయాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల గాయాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకంగా స్పందించాడు. గాయపడిన ఆటగాళ్ల విషయంలో ఎవరి బాధ్యత ఏమిటనేది స్పష్టంగా ఉండాలని, జవాబుదారీతనం అవసరమని అశ్విన్ పేర్కొన్నాడు. అదే సమయంలో జాతీయ జట్టు ఎంపిక విధానంలోనూ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

Read Also : Asian Games Shooting: భారత్‌కు మరో పతకం.. మహిళల స్కీట్ టీమ్‌కు కాంస్యం

Ashwin Comments on BCCI
Ashwin makes sensational comments on the BCCI Centre of Excellence!

Ashwin Comments on BCCI: ఫార్మాట్ల వారీగా ప్రత్యేక జట్ల ఏర్పాటు అవసరం

టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు జట్లను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అశ్విన్ సూచించాడు. అవసరాన్ని బట్టి కొంతమంది ఆటగాళ్లను ఒకటి కంటే ఎక్కువ ఫార్మాట్లలో కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డాడు.

ఇక బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని స్పోర్ట్స్ సైన్స్, వైద్య విభాగాలకు.. జాతీయ పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి మధ్య సమాచార మార్పిడిపై కూడా చర్చ జరుగుతోంది. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని తొలుత సెలెక్టర్లకు సమాచారం అందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ తర్వాత బుమ్రా గాయం తీవ్రత అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

వరుణ్ చక్రవర్తి ఉదాహరణతో తీవ్ర అసంతృప్తి

ఈ అంశంపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. ఆటగాళ్ల గాయాల నిర్వహణలో ఎవరిది బాధ్యత అనే విషయంలో స్పష్టత ఉండాలని చెప్పాడు. గాయాల విషయంలో సరైన సమాచార మార్పిడి, జవాబుదారీతనం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

తన వాదనకు ఉదాహరణగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విషయాన్ని కూడా అశ్విన్ ప్రస్తావించాడు. వరుణ్ మూడు, నాలుగు నెలల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని తెలిపాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు అనుమతి కోరినప్పటికీ అతడిని విడుదల చేయలేదని చెప్పాడు. నెల రోజుల్లో తిరిగి వస్తాడని భావించిన ఆటగాడు.. చివరకు రెండు, మూడు నెలలు అక్కడే ఉండాల్సి వచ్చిందని అశ్విన్ వివరించాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మీరాబాయి చాను సత్తా.. భారత్ ఖాతాలో రజత పతకం
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← “బస్సు ఆపను, మీరు చచ్చినా పర్వాలేదు” అని ప్రయాణికులతో అన్న డ్రైవర్Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com