Land Acquisition : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల, చింతల పూడి ప్రతిపాదిత బొగ్గు గనులు (యు.సి.జి )కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డిపిఆర్) ప్రకటిం చకుండా రైతులు, ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చలగాటం ఆడుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నాయి. రూ. లక్షల కోట్లు విలువ కలిగిన ప్రజా సంపదను రిల యన్స్ కంపెనీకి ఏ విధంగా కట్టబెడతారో చెప్పడం లేదు. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్ట్కు సంబం ధించిన వాస్తవ విషయాలు ప్రజలకు, రైతులకు తెలియజే యకుండా పెద్దకంపెనీకి లీజు కట్టబెట్టారు. రూ.2.73 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని మాయ మాటలు చెప్తూ ఆచరణలో జరిగే విధ్వంసం గురించి ప్రజలకు, రైతులకు వాస్తవ విష యాలు చెప్పడం లేదు. ప్రత్యక్షంగా 3500 నుండి 5వేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి చేసిన అన్ని దేశాలలో విధ్వంసం జరిగింది. ఈ ప్రాంతం లో ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, అరటి, మొక్కజొన్న, వరి, ఇతర అనేక ఉద్యాన, వాణిజ్య, ఆహార పంటలు పండు తున్నాయి. ఇక్కడ వ్యవసాయ కార్మికులకు ఈ పంటల ద్వారా సంవత్సరం అంతా పనులు దొరుకుతున్నాయి. ఉద్యాన పంటల ద్వారా మంచి ఆదాయం రైతులకు వస్తోంది.
Read Also : Indiramma Towers : ఇందిరమ్మ టవర్స్‌తో పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో సొంతిల్లు

Land Acquisition : భూ సేకరణల్లో రైతు లకు తీవ్ర నష్టం జరిగింది
సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి వలన జరిగే పర్యావరణం ముప్పు ఇతర అంశాలపై వాస్తవ విషయాలను వెల్లడించడం లేదు. ప్రజల జీవనానికి, పంటలకు నష్టం కలిగించే చాలా విష యాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇంతవరకు ప్రజా ప్రతి నిధులు గానీ, అధికారులు గానీ గ్రామసభలు జరిపివాస్తవ విషయాలను ప్రజలకు, రైతులకు తెలియజేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టె పనిలో ఉన్నాయి. గతంలో జరిగిన భూ సేకరణల్లో రైతు లకు తీవ్ర నష్టం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు, ఇతర భూసేకరణ ల్లో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అను భవాలున్నాయి. 2013 భూసేకరణ చట్టం అమలు కావ డం లేదు. యూజీసీ ప్రాజెక్టు కోసం 8562ఎకరాలు భూ సేకరణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శెట్టివారి గూడెంలో 77 ఎకరాలు ముందుగా పైలెట్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేస్తామంటున్నారు.

బలవంతంగా లాక్కునే ప్రయ త్నాలు
చింతలపూడి మండలం లోని చింతలపూడి, రేచర్ల, వెంకటాపురం, వెంకటాద్రి గూడెం, శెట్టివారిగూడెం, రాఘవాపురం, యర్రగుంటపల్లి, సీతానగరం, చింతంపల్లి తదితర గ్రామాలలో వేలాది ఎక రాలు రైతుల భూములు బలవంతంగా లాక్కునే ప్రయ త్నాలు ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులతో చర్చలు జరుపుతూ మీకు ఎంత పరిహారం కావాలో చెప్పండి అని అడుగుతున్నారు. యు. సి.జి ప్రాజెక్టుకు మేము భూములు ఇవ్వలేమని రైతులు చెబుతున్నా వారి మాటలను బేఖాతరు చేస్తూ రెవిన్యూ అధికారులు భూములమీదకు సర్వేకువస్తున్నారు. భూగర్భం లో బొగ్గును మండించి సింథటిక్ గ్యాస్ను పైకి తెస్తారు. దీని నుండి హైడ్రోజన్, మెథనాల్, అమోనియా, సింథటిక్ నేచురల్ గ్యాస్, సింథటిక్ ఇంధనాలు తయారు చేస్తారు. 2030 నాటికి రోజుకు 2050 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ సింగ్యాస్ తయారు చేసే ప్లాంట్ అందు బాటులోకి వస్తుందనికంపెనీ చెబుతున్నది. చింతలపూడి, రేచర్ల బ్లాక్ ల్లో 150 కోట్ల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నది. అన్ని అనుమతులు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రాథమికంగా ఇంతవరకు బొగ్గు గని ప్రాంత రైతులతో, ప్రజలతో చర్చిం చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు.
-కె. శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
హైదరాబాద్-విజయవాడ హైవేకు ఆరు వరుసల రూపం


