☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

కుటుంబ నియంత్రణకు కాలదోషం!

Family planning : ఒకప్పుడు జనాభా పెరిగిపోతోందని గగ్గోలు పెట్టిన ప్రభుత్వాలు రానురాను జనాభా తగ్గిపోతోంది కనుక ‘పిల్లల్ని కనండం’టూ కొత్త నినాదం అందిపుచ్చుకుని దానికి కూడా...
కుటుంబ నియంత్రణకు కాలదోషం!

Family planning : ఒకప్పుడు జనాభా పెరిగిపోతోందని గగ్గోలు పెట్టిన ప్రభుత్వాలు రానురాను జనాభా తగ్గిపోతోంది కనుక ‘పిల్లల్ని కనండం’టూ కొత్త నినాదం అందిపుచ్చుకుని దానికి కూడా ప్రోత్సా హకాలు ప్రకటించారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఏరకమైన అధికార పీఠం మీద కూర్చునేందుకు పనికిరాడని చట్టాలు నిర్దేశించాయి. అంటే ఏలినవారు ఆనాటి పరిస్థితులను బట్టి అలాంటి శాసనాలు అమల్లోకి తెచ్చారు. అప్పుడెప్పుడో ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ సమయంలో కుటుంబ నియంత్రణ పేరిట ఆవిడగారి సుపుత్రుడు చేసిన ఆకృత్యాలు అన్నీఇన్నీకావు. యువతరం కుర్రోళ్లను కట్టిపడేసి కుటుంబ నియంత్రణ కోసం బలవం తంగా వేనక్టమీ ఆపరేషన్లు చేసి పారేశారు. అత్యంత వేగంగా పెరిగిపోతున్న జనాభాను అరికట్టలేకపోతే వారిని పెంచి పోషించలేమనే ఆలోచనలో ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు తెగపడ్డారు. అటు నగరాల నుంచి గ్రామాల దాకా వైద్య ఆరోగ్య శాఖకు లక్ష్యాలు నిర్దేశించారు కూడా. ఆ తర్వాత ‘నియంత్రణ’ కాదు కుటుంబం యా వత్తు సుఖసంతోషాలతో జీవించాలంటే ఇద్దరు లేకముగ్గురు చాలు’ అనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లారు. దాన్నే ఇద్దరైతేనే ముద్దు అని మార్చి జీవనసారాన్ని బోధించారు. అదే ‘కుటుంబ సంక్షేమ కార్యక్రమం’గా మార్పు చేశారు. ఇప్పటికీ ఆ స్కీములు నడుస్తున్నట్లే ప్రభుత్వ లెక్కల్లో నమోదై ఉంది. లక్ష్యాలు మారాయి. కనుక ఆ పథకాన్ని కొనసాగించడంలో అర్ధంలేదు. కారణం ఇక పిల్లలు కావాలనుకున్నా, వద్దనుకున్నా ప్రభుత్వం తర పున ప్రభుత్వ పెద్దలే కంటే గింటే కవలల్ని కన్నా స్వాగతి స్తాం అంటున్నామన్న ప్రభుత్వాల ప్రయాన వింటూనే విన్నాం.

Read Also : NTR Baby Kit : ఏపీలో అమల్లోకి వచ్చిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్

Family planning
Family planning

Family planning : దేశాభివృద్ధికి జనాభా నియంత్రణ తప్పనిసరి

అయితే కాస్త ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకుని కుటుంబ నియంత్రణే అవసరమే లేన ప్పుడు దానికిచ్చే ప్రోత్సాహకాల బట్వాడా ఎందుకు? అనే ఆలోచనలో పడింది. తాజాగా కుటుంబ నియంత్రణకు సంబంధించిన అన్ని రకాల ప్రోత్సాహకాలను తక్షణమే నిలిపివేయాలని ప్రధాని ఆర్ధిక సలహా మండలి సిఫార్సు చేసింది. కుటుంబ నియంత్రణ అవార్డులు, ప్రపంచజనాభా దినోత్స వాలు, జనాభా నియంత్రణ కోసం నిర్వహించే వేసక్టమీ పక్షోత్సవాలను తక్షణమే ఆపేయాలని కోరింది. ప్రతి జంటా ఇద్దరు పిల్లల నిబంధనను కట్టుబడి ఉండేలా చేసేందుకు ఇచ్చే ‘ఆశా’ ప్రోత్సహకాలను రద్దు చేసింది. స్టెరిలైజేషన్తో ముడిపడిన అన్ని ప్రోత్సాహక చెల్లింపులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. 1952లో ప్రపం చంలోనే తొలిసారిగా దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టింది. అవసరం ఉన్నా లేకున్నా ఇప్పటికీ ఆ పథకాలు ఉనికిలో ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో సింగపూర్ వంటి దేశాలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో అప్పటి పాలకులు దేశ జనాభావేగంగా పెరగడాన్ని బట్టి దేశాభివృద్ధికి జనాభా నియంత్రణ తప్పనిసరియని కుటుంబ నియంత్రణ కార్య క్రమాలను అమల్లోకి తెచ్చాయి. అటుపై జననాలు తగ్గించి మాతాశిశు సంరక్షణ లక్ష్యంలో చాన్నాళ్లు ముందుకు సాగిం ది.

భారత్ ప్రథమస్థానంలో ఉంది

1977 లక్ష్యాలు కొద్దిగా మార్చి కుటుంబ సంక్షేమశాఖగా మారింది. ఎన్నో లక్షల మందికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసిన కేంద్రప్రభుత్వం వద్ద వాటి సంఖ్య తెలిపే రికార్డులేమీ భద్రంగా లేవనే మాట వినిపిస్తోంది. 1970 నుంచి 2007 వరకు కోట్లాది మంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసుకున్నట్లు తేటతెల్లమైనా ఎన్ని కోట్ల మంది అనే లెక్కలు తేలలేదు. కాలక్రమంలో కుటుంబ నియంత్రణ పథకానికి కాలదోషం పట్టింది. సంక్షేమం సంగతి దేవుడెరుగు బాలింతగానో చూలింతగానో ఉండగా ధను ర్వాతం పడకుండా వారి సంక్షేమానికి వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎంత మందిని కాపాడ గలిగారో చెప్పగలిగిన అంకెలూ కనపడవు. 2008 నుంచి 2019ల మధ్య దేశంలో దాదాపు 5.16 కోట్ల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయన్న అంకెలను మాత్రం ప్రభుత్వం ప్రకటిస్తోంది. వివిధ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారానే వీటి వివరాలైనా తెలిసాయి. దేశంలో శాశ్వత కుటుంబ నియం త్రణ మేలనుకున్నవారు మాత్రమే. ముఖ్యంగా మహిళల్లో ఇతరత్రా దుష్ప్ర భావాలు కలుగకుండా ట్యుబెక్టమీ లేక లాపరోస్కాపీ విధానంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారం తే! ప్రపంచంలోనే మహిళల స్టెరిలైజేషన్ జరుపుకుంటున్న దేశాలలో భారత్ ప్రథమస్థానంలో ఉంది. కానీ పురుషులు ఈ కుటుంబ నియంత్రణలో భాగంగా వేసక్టమీ చేయిం చుకున్న సందర్భా లు బహు తక్కువ. 0.3 శాతం మంది మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లు చేయిస్తున్నారు.

Family planning
Family planning

నిబంధనలతో ఉన్న చట్టాలను ఎత్తి వేయాలని

తాజా దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనాభా పెరు గుదల అవసరాలను ఏకరవు పెడుతూ ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మందిని కంటే స్థానిక ఎన్నికలో అనర్హత వేటు వేసే నిబంధనలతో ఉన్న చట్టాలను ఎత్తి వేయాలని సలహా మండలి సిఫార్సు చేసింది. ‘ద ఘోస్ట్ ఆఫ్ పాపు లేషన్ పాస్ట్, హౌ పాపులేషన్ కంట్రోల్ పెర్సిస్ట్ ఇన్ ఇండియా పేరిట సూచనల పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుంచిం ది. దాంతో ఈ పత్రంలో ఉన్న అంశాలన్నీ సర్వసమ్మతమే నంటూ సదరు పత్రాన్ని స్వాగతించింది. సంతానోత్పత్తి తగ్గించే నియంత్రణ చర్యలను ఆపివేసి జనాభా సమానత్వం, సంసిద్ధతపై దృష్టి సారించాలని సూచించింది. శస్త్ర చికిత్సలు చేసుకునే వారికిచ్చే వేతన నష్టపరిహారాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరింది. ఇలాంటి ప్రోత్సహకాలు ఇవ్వడం ప్రస్తుత లక్ష్యాలకు పూర్తి భిన్నం కనుక ఖజానాకు నిధులు మిగిల్చి దుర్వినియోగమనే అపప్రథ రాకుండా చూసేందుకు కేంద్రప్రభుత్వ ప్రధాని ఆర్థిక సలహా మండలి సంకల్పించింది. కాస్త ఆలస్యమైనా ప్రభుత్వ కోశాగారానికి లక్ష్మీకళ వచ్చిపడ్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హైదరాబాద్‌-విజయవాడ హైవేకు ఆరు వరుసల రూపంపీబీ ఫిన్‌టెక్ షేర్లు 30% పతనం.. పాలసీబజార్ స్టాక్ ఎందుకు కుప్పకూలింది? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com