22 A Dispute Controversy : తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు కాక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎండీఏ (HMDA), డీటీసీపీ (DTCP) వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుండి అన్ని రకాల ప్లానింగ్ అనుమతులు పొందినప్పటికీ, కేవలం సాంకేతిక లోపాల కారణంగా రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ‘సెక్షన్ 22A’ (నిషేధిత ఆస్తుల జాబితా)లో చిక్కుకున్న ఆస్తులకు తక్షణమే రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో ఇటు కొనుగోలుదారులు, అటు రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురవుతున్న తీవ్ర ఆటంకాలకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది.
Read Also : నేడు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

అక్రమాలపై విచారణకు ‘శ్రీదేవసేన’ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ
మరోవైపు, 22A నిషేధిత భూముల పేరుతో గతంలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి. శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ నిషేధిత భూముల పరిధిలో జరిగిన భూ కేటాయింపులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్లను ఆమూలాగ్రం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అర్హులైన సామాన్యులకు తక్షణ న్యాయం చేస్తూనే, భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెండంచెల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






