Oh Naa Siddhayya team: ‘ఓ నా సిద్ధయ్య’ సినిమా బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 70 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొని ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత కలిగిన అభ్యర్థులను అక్కడికక్కడే ఎంపిక చేసి, పలువురికి వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశారు.
Read Also : Kalki 2 : ‘కల్కి-2’లో దుల్కర్ సల్మాన్?

Oh Naa Siddhayya team: ఆటో డ్రైవర్లకు బీమా
ఈ సందర్భంగా చిత్ర రూపకర్త సిద్ధూరెడ్డి (Siddu Reddy Kandakatla) మాట్లాడుతూ.. పాట అంటే తనకు ప్రాణమని, భార్యాభర్తల మధ్య ఉండే అత్యంత భావోద్వేగమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లు వెల్లడించారు. తన పాట ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని, దానికి గుర్తుగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంతేగాక, సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం ద్వారా 300 మంది ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. అలాగే తమ చిత్రం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన సాంకేతిక విభాగాల సభ్యులకు (టెక్నీషియన్లకు) కూడా బీమా చేయించడం విశేషం.
సినీ ప్రముఖుల సందడి.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఈ జాబ్ మేళా, ఉచిత బీమా పంపిణీ కార్యక్రమంలో సినీ నటి వైష్ణవి చైతన్య, కాత్యాయిని తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. వారి రాకతో ప్రాంగణంలో కొత్త ఉత్సాహం నిండింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


