☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

జైలర్ 2: ఆకట్టుకుంటున్న వన్ సన్.. వన్ మూన్ సాంగ్

జైలర్ 2: ఆకట్టుకుంటున్న వన్ సన్.. వన్ మూన్ సాంగ్ Caption of Image. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిక్చర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘వన్ సన్ వన్ మూన్’ అంటూ సాగిన పాటను అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేయడంతోపాటు ఎం.ఎస్.కృష్ణతో కలిసి పాడటం హైలైట్‌‌గా నిలిచింది. తమిళ, ఇంగ్లీష్ కలయికలో సాగిన పాటకు హైసెన్‌‌బర్గ్, సూపర్ సుబు లిరిక్స్ అందించారు. రజనీకాంత్‌‌ ఇమేజ్, ఆయనకున్న స్టార్‌‌డమ్‌‌ను ఎలివేట్ చేసేలా మెలోడీ టచ్‌‌తో పాటను రూపొందించారు. ఇందులో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన కొన్ని కొత్త లుక్స్‌‌ సినిమాపై ఆసక్తిని
జైలర్ 2: ఆకట్టుకుంటున్న వన్ సన్.. వన్ మూన్ సాంగ్
జైలర్ 2: ఆకట్టుకుంటున్న వన్ సన్.. వన్ మూన్ సాంగ్

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిక్చర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘వన్ సన్ వన్ మూన్’ అంటూ సాగిన పాటను అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేయడంతోపాటు ఎం.ఎస్.కృష్ణతో కలిసి పాడటం హైలైట్‌‌గా నిలిచింది.

తమిళ, ఇంగ్లీష్ కలయికలో సాగిన పాటకు హైసెన్‌‌బర్గ్, సూపర్ సుబు లిరిక్స్ అందించారు. రజనీకాంత్‌‌ ఇమేజ్, ఆయనకున్న స్టార్‌‌డమ్‌‌ను ఎలివేట్ చేసేలా మెలోడీ టచ్‌‌తో పాటను రూపొందించారు. ఇందులో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన కొన్ని కొత్త లుక్స్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘జైలర్’లో ముత్తువేల్ పాండియన్‌‌గా అదరగొట్టిన రజనీకాంత్.. సీక్వెల్‌‌లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు.

తొలి భాగంలోని రమ్యకృష్ణన్, మిర్నా, శివరాజ్‌‌కుమార్, యోగిబాబు, జాఫర్ సాదిక్, వినాయకన్ తదితరులు ‘జైలర్ 2’లోనూ కనిపించనున్నారు. కొత్తగా ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజారమూడు, విద్యాబాలన్, విజయ్ సేతుపతి, షామ్నా కాసిమ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తాం: ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com