☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

students lock Up in hostel | స్కూల్‌ హాస్టల్‌లో బంధించుకున్న విద్యార్థులు.. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్‌

students lock Up in hostel | స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఒక విద్యార్థిని కొట్టడంపై 360 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్కూల్‌ హాస్టల్‌లో తమను తాము బంధించుకున్నారు. పలు గంటల పాటు హాస్టల్‌ గదుల్లో ఉండి లోపల నుంచి గడియపెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు.
students lock Up in hostel | స్కూల్‌ హాస్టల్‌లో బంధించుకున్న విద్యార్థులు.. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్‌

భోపాల్‌: స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఒక విద్యార్థిని కొట్టడంపై 360 మంది విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్కూల్‌ హాస్టల్‌లో తమను తాము బంధించుకున్నారు. పలు గంటల పాటు హాస్టల్‌ గదుల్లో ఉండి లోపల నుంచి గడియపెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. చివరకు అధికారులు అక్కడకు చేరుకుని హామీ ఇవ్వడంతో బయటకు వచ్చారు. (students lock Up in hostel) మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జరంగ్‌గఢ్‌లోని జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆహారం నాణ్యతపై ఫిర్యాదు చేయగా ప్రిన్సిపాల్ హెచ్‌కే మీనా దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

కాగా, ఆ స్కూల్‌ విద్యార్థులు దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదివారం సాయంత్రం 9 నుంచి 12వ తరగతికి చెందిన సుమారు 360 మంది విద్యార్థులు తమ హాస్టల్ గదుల్లో బంధీ అయ్యారు. రూమ్స్‌ లోపల నుంచి గడియపెట్టుకున్నారు. పలు గంటల పాటు హాస్టల్స్‌ రూమ్స్‌లో ఉండిపోయారు. ఆ ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు తాము ఆహారం తీసుకోబోమని, నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. ఉపాధ్యాయులు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ గేట్లు తెరవడానికి విద్యార్థులు నిరాకరించారు.

మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
గంటల తరబడి నచ్చజెప్పడంతోపాటు హామీలు ఇచ్చారు. దీంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యార్థులు హాస్టల్ గేట్లు తెరిచి బయటకు వచ్చారు. భోజనం చేయడానికి అంగీకరించారు.

అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంయుక్త దర్యాప్తు బృందాన్ని జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. నవోదయ సంస్థకు చెందిన ప్రాంతీయ అధికారులు అక్కడకు చేరుకుని ఆహార నమూనాలు సేకరించారు. బాధిత విద్యార్థితో పాటు ఇతర స్టూడెంట్స్‌ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ సంఘటనపై నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KTR | ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే నిరంకుశంగా మారుతున్నది : కేటీఆర్‌Shashi Tharoor | ఆ వినాశ సాఫ్ట్‌వేర్‌ను ర‌ద్దు చేయాలి.. ఎంపీ శ‌శిథ‌రూర్ పిలుపు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com