☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు

Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu […]
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు

Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu Shuang. వీరిద్దరూ చైనాలోని చెంగ్డూ రీసెర్చ్ బేస్ ఆఫ్ జెయింట్ పాండా బ్రీడింగ్‌లో జన్మించారు.

ఈ రెండు పాండాలను అట్లాంటా జూకు పంపేందుకు China Wildlife Conservation Associationతో Zoo Atlanta ఏప్రిల్ 2026లో కొత్త అంతర్జాతీయ సహకార పరిశోధనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జిన్‌పింగ్ తాజా ప్రకటన ప్రకారం Ping Ping, Fu Shuang రాబోయే రోజుల్లో అట్లాంటాకు చేరుకోనున్నాయి. అయితే వాటి ఖచ్చితమైన రాక తేదీని జూ అధికారులు ఇంకా వెల్లడించలేదు.

అమెరికా-చైనా స్నేహానికి ప్రతీకగా పాండాలు

పాండాలను చైనా చాలాకాలంగా దౌత్య సంబంధాల్లో స్నేహానికి ప్రతీకగా ఉపయోగిస్తోంది. జిన్‌పింగ్ కూడా ఈ రెండు పాండాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడంతో పాటు సహకారాన్ని విస్తరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. పాండాల పరిరక్షణ, పరిశోధనలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించడం కూడా ఈ ఒప్పందంలో కీలక అంశంగా ఉంది.

1972 నుంచి కొనసాగుతున్న ‘పాండా డిప్లమసీ’

అమెరికా-చైనా సంబంధాల్లో పాండాల కథ కొత్తది కాదు. 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాను సందర్శించిన సమయంలో చైనా అమెరికాకు Ling-Ling, Hsing-Hsing అనే రెండు పాండాలను అందించింది. అవి వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో ప్రముఖ ఆకర్షణగా నిలిచాయి. ఈ సంప్రదాయానికే తర్వాత ‘Panda Diplomacy’ అనే పేరు వచ్చింది. అట్లాంటా జూతో చైనా గతంలో కూడా దీర్ఘకాలిక పాండా పరిరక్షణ భాగస్వామ్యాన్ని కొనసాగించింది. 1999లో ప్రారంభమైన ఆ ఒప్పందం 2024లో ముగిసింది. ఆ 25 ఏళ్ల భాగస్వామ్యంలో అట్లాంటాలో ఏడు పాండా పిల్లలు జన్మించాయి.

రెండేళ్ల తర్వాత మళ్లీ అట్లాంటాకు పాండాలు

2024లో అట్లాంటా జూలో ఉన్న పాండాలు చైనాకు తిరిగి వెళ్లిన తర్వాత అక్కడ జెయింట్ పాండాలు లేకుండా పోయాయి. ఇప్పుడు Ping Ping, Fu Shuang రాకతో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అట్లాంటా జూలో మళ్లీ పాండాలను చూసే అవకాశం ఏర్పడుతోంది.

ట్రంప్- జిన్‌పింగ్ భేటీలో పాండా ప్రకటన

జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అదే సమయంలో పాండాలను అట్లాంటాకు పంపుతున్నట్లు జిన్‌పింగ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘పాండా డిప్లమసీ’ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్‌ను భారత్ ‘చీటింగ్’ చేసిందా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com