☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మగాళ్ల శీలానికీ రక్షణ లేదా: జంతర్ మంతర్ ఆందోళనలో ఏం జరిగిందంటే..?

మగాళ్ల శీలానికీ రక్షణ లేదా: జంతర్ మంతర్ ఆందోళనలో ఏం జరిగిందంటే..? Caption of Image. న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ పిలుపు మేరకు ఈ నిరసనలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఈ నిరసనకు అనుమతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు సీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సీజేపీ నిరసనకారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోన్న ఓ యువకుడి ప్యాంట్ లాగిపడేశారు పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడిలో వైరల్‎గా మారింది. దీ
మగాళ్ల శీలానికీ రక్షణ లేదా: జంతర్ మంతర్ ఆందోళనలో ఏం జరిగిందంటే..?
మగాళ్ల శీలానికీ రక్షణ లేదా: జంతర్ మంతర్ ఆందోళనలో ఏం జరిగిందంటే..?

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ పిలుపు మేరకు ఈ నిరసనలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఈ నిరసనకు అనుమతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు సీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సీజేపీ నిరసనకారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోన్న ఓ యువకుడి ప్యాంట్ లాగిపడేశారు పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడిలో వైరల్‎గా మారింది. దీంతో నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ALSO READ : ఢిల్లీలో హై టెన్షన్.. కేజ్రీవాల్, మమతా బెనర్జీ అరెస్ట్..

ఢిల్లీ పోలీసులు మహిళలను మాత్రమే కాకుండా, పురుష నిరసనకారులను కూడా లైంగికంగా వేధిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిరసనకారులతో ఉద్దేశపూర్వకంగా అనుచితంగా ప్రవర్తిస్తూ ఆ తర్వాత విధి నిర్వహణలో భాగమంటూ కవర్ చేసుకుంటారని.. నిజంగా ఇది సిగ్గుచేటని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మగాళ్ల శీలానికీ రక్షణ లేదా అంటూ పోలీసుల తీరుపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీజేపీ మద్దతుదారులు నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన సమయంలో కూడా ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా నిరసనకారుల పట్ల పురుష పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. యువతుల జట్టు పట్టుకుని లాగడం, శరీరాన్ని ఇష్టమొచ్చినట్లుగా తాకడం వంటి అనుచిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో కూడా ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Andhra: ప్రస్తుతం ధర లేదు.. అయినా లాభమే..! బంతిపూలతో రైతు సక్సెస్..IPL 2027కి ముందు CSKలో మరో కీలక మార్పు.. జట్టును వీడిన మైఖేల్ హస్సీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com