☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

KCR | ‘జై కేసీఆర్’ అన్నందుకు పోలీస్‌ కేసు.. ఇదేం సర్కార్..!

KCR : కాంగ్రెస్ పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు జపిస్తున్నారు. పండుగలు, వేడుకల్లో.. కేసీఆర్ పాటలతో హోరెత్తిస్తున్నారు.
KCR | ‘జై కేసీఆర్’ అన్నందుకు పోలీస్‌ కేసు.. ఇదేం సర్కార్..!

KCR : కాంగ్రెస్ పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు జపిస్తున్నారు. పండుగలు, వేడుకల్లో.. కేసీఆర్ పాటలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలోనే వినాయక చవితి సందర్భంగా డీజేల్లో గులాబీ బాస్ పాటలు వింటూ.. పాడుతూ హుషారుగా స్టెప్పులేస్తున్నారు. జనంలో కేసీఆర్‌కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తోంది. తాజాగా ఓ ట్రాన్స్‌ జెండర్ మాట్లాడుతూ.. జై కేసీఆర్ అన్నందుకు తనపై కేసు పెట్టారని వాపోయింది.

తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పేరును, ఆయన ఆనావాళ్లను చెరిపేసేందుకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ ఈసారి పోలీస్‌ కేసులకు తెరతీసింది. వినాయక నిమజ్జనం సమయంలో జనం కేసీఆర్ పాటలు వినడాన్ని భరించలేక కేసులు పెడుతోంది. ట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా జై కేసీఆర్ అన్నందుకు తన మీద కేసు పెట్టారని ట్రాన్స్‌జెండర్ శృతి యాదవ్ వాపోయింది. ‘ఇదెక్కడి అన్యాయం? ఇదేమి సర్కార్?’ అని ఆమె రేవంత్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← UPI ఛార్జీలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం‌లకు రూ.8వేల 500 కోట్లు లాభం!TG-TMARS | ట్రాఫిక్ నిర్వహణకు టీజీ -టీమార్స్.. కీలక బాధ్యతలు ఇవే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com