Singareni Head Office | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో కల్పతరువుగా నిలిచిన సింగరేణి రక్షణే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పోరాటాలు సాగిస్తుంది. ఈ క్రమంలో సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై బీఆర్‌ఎస్ గళమెత్తుతున్న విషయం తెలిసిందే. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై నిజానిజాలను తెలుసుకునేందుకు లక్డీకాపూల్ వద్ద ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్‌ను గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందతోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. అక్రమాలను బయటకు రానీయకుండా బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకునేందుకు సర్కార్ అణచివేత ధోరణి ఎలా ఉందో సింగరేణి ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల గస్తీ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
లక్డీకాపుల్ వద్ద ఉన్న సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు
సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై నిజాలను తెలుసుకునేందుకు, హెడ్ ఆఫీసును సందర్శించనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇతర బీఆర్ఎస్ నాయకులు
ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు భారీ పోలీస్… pic.twitter.com/I5RghhPZYA
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!






