☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Poonam Kaur: అవసరం కోసం వాడుకుని వదిలేశారు.. త్రివిక్రమ్‌పై నటి పూనమ్ షాకింగ్ పోస్ట్!

Poonam Kaur: అవసరం కోసం వాడుకుని వదిలేశారు.. త్రివిక్రమ్‌పై నటి పూనమ్ షాకింగ్ పోస్ట్!
Poonam Kaur: అవసరం కోసం వాడుకుని వదిలేశారు.. త్రివిక్రమ్‌పై నటి పూనమ్ షాకింగ్ పోస్ట్!
Poonam Kaur: అవసరం కోసం వాడుకుని వదిలేశారు.. త్రివిక్రమ్‌పై నటి పూనమ్ షాకింగ్ పోస్ట్!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఎప్పుడూ పరోక్ష వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కలకలం రేపే పూనమ్ .. లేటెస్ట్ గా నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ తన ఇన్ స్టా స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేసింది... తన కుటుంబ సభ్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇప్పించారని పూనమ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నేను కట్టుబడి లేను. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు తమ కుటుంబం ఎందుకు జవాబుదారీ అని ప్రశ్నించింది. సమస్య వచ్చినప్పుడు పారిపోయి, మళ్లీ తమ అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొంది.. అంతేకాకుండా ఈ వివాదంపై 'మా' (MAA) అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. మరికొంతమంది అమాయకుల జీవితాలు నాశనమయ్యే వరకు చూస్తూ ఉంటారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది.

ఇదే సమయంలో నానా పటేకర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన మరో పోస్ట్ కూడా చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన బాధితులకు వారు కలిగించిన వేదన, క్షోభ చెరిగిపోవన్నారు. వేధింపులకు పాల్పడిన సదరు వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ వేధింపులు అబద్ధాలు అయిపోవు. ఒక వ్యక్తిని పొగడటానికి మాత్రమే అనుమతిస్తూ.. బాధితులను పూర్తిగా విస్మరిస్తే ఎలా? ప్రశ్నించారు. ఒకరి మరణానికి సంతాపం తెలపడం ఎంత సహజమో.. వారి వల్ల బాధని మోస్తున్న వ్యక్తుూ ఉంటారనే విషయాన్ని గుర్తించుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చారు.

ALSO READ : ‘అమ్మో ఎవ్వర్రా ఇది’.. ‘సీన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఈ పరిణామాలు టాలీవుడ్‌లో మరోసారి పెద్ద దుమారమే రేపుతున్నాయి. గతంలో పూనమ్ సోషల్ మీడియా వేదికగా.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసేశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి పూనమ్ కౌర్ లేవనెత్తిన ప్రశ్నలపై సంబంధిత వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కే దిగుతారు!.. జంతర్ మంతర్ నిరసనలపై పాక్ మాజీ ప్లేయర్ సెటైర్స్!పనామా తీరంలో భూకంపం... సునామీ హెచ్చరికలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com