☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

ప్రాజెక్ట్‌ మెరిడియన్‌కు ఎలాన్‌ మస్క్‌ నాయకత్వం

Project Meridian Warfare Study : అమెరికా రక్షణ శాఖ భవిష్యత్‌ యుద్ధాలు, సాంకేతిక పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ‘ప్రాజెక్ట్‌ మెరిడియన్‌’ పేరుతో ఉన్నతస్థాయి సలహా కమిటీని ఏర్పాటు...
ప్రాజెక్ట్‌ మెరిడియన్‌కు ఎలాన్‌ మస్క్‌ నాయకత్వం

Project Meridian Warfare Study : అమెరికా రక్షణ శాఖ భవిష్యత్‌ యుద్ధాలు, సాంకేతిక పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ‘ప్రాజెక్ట్‌ మెరిడియన్‌’ పేరుతో ఉన్నతస్థాయి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎలాన్‌ మస్క్‌ నాయకత్వం వహించనున్నారు. అమెరికా సైనిక వ్యవస్థను భవిష్యత్‌ సవాళ్లకు అనుగుణంగా ఆధునీకరించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. మస్క్‌తో పాటు అండూరిల్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు పాల్‌ లక్కీ, మాజీ హౌస్‌ స్పీకర్‌ న్యూట్‌ గ్రింగ్రిచ్‌ వంటి ప్రముఖులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్‌ టెక్నాలజీ సంస్థల అనుభవాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కొత్త సైనిక సామర్థ్యాలను గుర్తించడంపై కమిటీ దృష్టి పెట్టనుంది.

Read Also: NESCO World Heritage : యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్‌కు చెందిన 5 కొత్త వారసత్వ ప్రదేశాలు

Project Meridian Warfare Study
Project Meridian Warfare Study

Project Meridian Warfare Study : 120 రోజుల్లో అధ్యయనం పూర్తి

ప్రాజెక్ట్‌ మెరిడియన్‌ బృందానికి అమెరికా రక్షణ శాఖ 120 రోజుల గడువు విధించింది. భవిష్యత్‌ యుద్ధాల స్వరూపం, సాంకేతిక పరిణామాలు, సైనిక సామర్థ్యాల్లో అవసరమైన మార్పులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సైనిక నాయకత్వం కోసం ప్రత్యేకంగా రహస్య నివేదికను కూడా అందించనుంది. అమెరికా రక్షణ శాఖ రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్వయంప్రతిపత్తి సాంకేతికతలను సైనిక రంగంలో మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘అటానమస్‌ వార్‌ఫేర్‌ కమాండ్‌’ ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించారు. భవిష్యత్‌ సైనిక అవసరాలకు అనుగుణంగా ఆటోనమస్‌ వ్యవస్థల అభివృద్ధికి ఇది ఉపయోగపడనుంది. సైబర్‌ దాడులు, విద్రోహ చర్యలు వంటి ముప్పుల నుంచి అమెరికా సైనిక స్థావరాలను రక్షించేందుకు ‘ఫోర్ట్రెస్‌ అమెరికా’ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. దేశీయ సైనిక మౌలిక వసతులను మరింత స్వయం సమృద్ధిగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG
← తగ్గుముఖం పడుతున్న పసిడి రేట్లు.. నేటి ధరల వివరాలు ఇవే!అక్టోబరు నెల మొత్తం రాశి ఫలాలు: వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతాయి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com