☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు

Pulivendula Chicken Centre Fire: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో హింస ఆందోళనకు కలిగిస్తోంది.. ఇక, కడప జిల్లా పులివెందులలో వైసీపీ సానుభూతిపరులకు చెందిన చికెన్ సెంటర్‌కు దుండగులు నిప్పంటించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అగ్నిప్రమాదానికి గురైన చికెన్ సెంటర్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో పులివెందులలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చికెన్ సెంటర్‌లోని సామగ్రితో పాటు రెండు బైకులను […]
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు

Pulivendula Chicken Centre Fire: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో హింస ఆందోళనకు కలిగిస్తోంది.. ఇక, కడప జిల్లా పులివెందులలో వైసీపీ సానుభూతిపరులకు చెందిన చికెన్ సెంటర్‌కు దుండగులు నిప్పంటించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అగ్నిప్రమాదానికి గురైన చికెన్ సెంటర్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో పులివెందులలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

చికెన్ సెంటర్‌లోని సామగ్రితో పాటు రెండు బైకులను కూడా తగలబెట్టారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు టీడీపీ అనుచరులే కారణమని ఆరోపించారు. టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి ప్రధాన అనుచరుడిగా పేర్కొన్న ఆక్కులగారి విజయ్, డైరెక్టర్ కిరికిరి భాష సోదరుడు షామీర్ ఈ ఘటనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆక్కులగారి విజయ్, షామీర్ పెట్రోల్ క్యాన్లతో చికెన్ సెంటర్‌లోకి ప్రవేశించి నిప్పంటిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని ఎంపీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు.

పుంగనూరు, రాయచోటి ఘటనలపైనా ప్రస్తావన
గతంలో పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల ఘటనను కూడా అదే తరహాలో పరిగణిస్తే, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులపై సందేహాలు తలెత్తుతాయని అన్నారు. వై కేటగిరీ భద్రత కలిగిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. అలాగే పులివెందులలో వైసీపీ కార్యాలయం వద్ద వాహనానికి నిప్పంటించి బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి
పుంగనూరు, రాయచోటి ఘటనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే తాము కూడా ఎంతదూరమైనా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పులివెందుల ఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..Test Twenty Cricket: క్రికెట్‌లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com