☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!

అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ఈసీ)కు కూడా ఫిర్యాదు చేశారు. పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం […]
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!

అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ఈసీ)కు కూడా ఫిర్యాదు చేశారు. పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మా అభ్యర్థుల నామినేషన్లు అధికారులు తీసుకోవడం లేదు. మా అభ్యర్థులను భయపెట్టేలా కేసులు పెడుతున్నారు. అందుకే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాం. హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. మేం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. పుంగనూరు, రాయచోటిలో మేం గెలుస్తామనే ఇబ్బందులు పెడుతున్నారు. నాపైనే దాడులు చేసి, నాపైనే కేసులు పెట్టారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూటమి గెలిచే పరిస్థితి లేదు’ అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్లు సమర్పించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన కోర్టును కోరారు.

ఇదిలా ఉండగా ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు పట్టణానికి రావొద్దంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నామినేషన్ల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఈ నోటీసులు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్నది కీలకంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com