☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భ‌గ‌వంత్ మాన్‌కు 50వేల ఫైన్‌

CM Bhagwant Mann : పంజాబ్ సీఎం భగ‌వంత్ మాన్ సింగ్‌ను ఢిల్లీ విమానాశ్ర‌యంలో సుమారు మూడు గంట‌ల పాటు నిర్బంధించారు. దీంతో పాటు సీఎం భ‌గ‌వంత్‌కు సుమారు 50వేల జ‌రిమానా కూడా విధించిన‌ట్లు తెలుస్తోంది. పారిస్ టూరు నుంచి తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భ‌గ‌వంత్ మాన్‌కు 50వేల ఫైన్‌

చండీఘ‌డ్‌: పంజాబ్ ముఖ్యమంత్రి భగ‌వంత్ మాన్ సింగ్‌(CM Bhagwant Mann)ను ఢిల్లీ విమానాశ్ర‌యంలో సుమారు మూడు గంట‌ల పాటు నిర్బంధించిన‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అక్టోబ‌ర్ 19వ తేదీన రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం భ‌గ‌వంత్‌కు సుమారు 50వేల జ‌రిమానా కూడా విధించిన‌ట్లు తెలుస్తోంది. పారిస్‌లో జ‌రిగిన ఫుడ్ ట్రేడ్ స‌ద‌స్సు నుంచి తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో సీఎం మాన్‌ను ఢీల్లీ విమానాశ్ర‌యంలో నిర్బంధించారు. సీఎం మాన్‌ను కేంద్రంలోని బీజేపీ అవ‌మానించిన‌ట్లు ఆప్ నేత బ‌ల్తేజ్ ప‌న్నూ ఆరోపించారు. ఢిల్లీ విమానాశ్ర‌యం చేరుకున్న త‌ర్వాత సీఎం మాన్‌ను ఆపార‌ని, లాగేజీ వ‌స్తోంద‌ని, చెక్ చేయాల‌ని అన్న‌ట్లు పన్నూ తెలిపారు. కావాల‌నే ఆయ‌న్ను నిర్బంధించిన‌ట్లు ఆరోపించారు. మూడు గంట‌ల త‌ర్వాత విమానాశ్ర‌యం నుంచి సీఎం భ‌గ‌వంత్ వెళ్తున్న స‌మ‌యంలో.. అత‌నికి 50వేల ఛ‌లాన్ జారీ చేసిన‌ట్లు ప‌న్నూ ఆరోపించారు. పంజాబీల గౌర‌వాన్ని , గుర్తింపును దెబ్బ‌తీసే రీతిలో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌కు చెందిన ఫ్రాన్స్ టూరుకు కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో పంజాబ్ హైకోర్టు ఆదేశాల‌తో ఆయ‌న పారిస్ ట్రిప్‌కు వెళ్లారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com