☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..

Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రతి రోజూ ఉదయం చేసే మొదటి ఫోన్ కాల్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకే వెళ్తుంది. నినాదాలు, పోలీస్ బారికేడ్లు, కెమెరాల హడావుడి మొదలకాకముందే.. ఆ రోజంతా ఏం చేయాలనే దానిపై వీరిద్దరూ చర్చించుకుని, పొలిటికల్ అజెండాను సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత రాహుల్ తన సొంత బృందం లేదా "ఇన్నర్ సర్కిల్తో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాజకీయం, వ్యూహాలు, ప్రచారం, ప్రజల్లోకి వెళ్లే ఇమేజ్ (ఆప్టిక్స్) వంటి అంశాలపై గంటల తరబడి చర్చలు సాగుతాయి.
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..

Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రతి రోజూ ఉదయం చేసే మొదటి ఫోన్ కాల్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకే వెళ్తుంది. నినాదాలు, పోలీస్ బారికేడ్లు, కెమెరాల హడావుడి మొదలకాకముందే.. ఆ రోజంతా ఏం చేయాలనే దానిపై వీరిద్దరూ చర్చించుకుని, పొలిటికల్ అజెండాను సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత రాహుల్ తన సొంత బృందం లేదా “ఇన్నర్ సర్కిల్తో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాజకీయం, వ్యూహాలు, ప్రచారం, ప్రజల్లోకి వెళ్లే ఇమేజ్ (ఆప్టిక్స్) వంటి అంశాలపై గంటల తరబడి చర్చలు సాగుతాయి. ఆ తర్వాతే ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతారు. ఇక ‘ఇండియా’ కూటమి శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, శక్తి ప్రదర్శనలు ప్లాన్ చేసినప్పుడు, రాహుల్ స్వయంగా పొత్తు భాగస్వామ్య నేతలతో ఫోన్ చేసి మాట్లాడతారు. ఇలా మధ్యాహ్నానికి ముందే ఆ రోజుకు సంబంధించిన పొలిటికల్ డ్రామాకు పక్కా స్క్రిప్ట్ సిద్ధమైపోతుంది. ఇక అసలైన డ్రామాను మధ్యాహ్నం తర్వాత, అంటే టీవీ ప్రైమ్-టైమ్ వార్తలకు సరిగ్గా సెట్ అయ్యే సమయానికి రోడ్డుపైకి తెస్తారు.

మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు సుదీర్ఘంగా సాగే ధర్నాలు..

సాయంత్రం వేళల్లో పత్రికల ఎడిటర్లు ఫ్రంట్ పేజీ స్టోరీలపై దృష్టి పెట్టే సమయానికి, రిపోర్టర్లు వార్తలు రాసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు, టీవీ న్యూస్ రూమ్‌లు ప్రైమ్-టైమ్ డిబేట్లకు సిద్ధమవుతున్న వేళ, అలాగే ఉద్యోగాలు, కాలేజీల నుంచి ఇంటికి తిరిగొచ్చే యువత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్) క్లిప్‌లు చూడటం ప్రారంభించే సమయానికి.. దేశ రాజధాని ఢిల్లీ హృదయభాగంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ధర్నాలు, నిరసనలు షురూ అవుతాయి. జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం బయట చేసిన ధర్నా నుంచి, అక్టోబర్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ వరుసగా చేపట్టిన నిరసనల వరకు.. రాహుల్ గాంధీ క్షేత్రస్థాయి రాజకీయం ఓ స్పష్టమైన టైమింగ్‌ను, శైలిని సంతరించుకుంది. పోలీసులతో వాగ్వాదాలు, బారికేడ్లు ఎక్కడం, నినాదాలు, మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు సుదీర్ఘంగా సాగే ధర్నాలు.. ఇవన్నీ వార్తల్లో ఆయన క్రమం తప్పకుండా నిలిచేలా చేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ నిరసనల మధ్యలోనే ప్రతిపక్ష ఎంపీలతో కలిసి కన్నాట్ ప్లేస్‌లోని హోటళ్లలో లంచ్ లేదా హై-టీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సరదా భోజనాల ముచ్చట్లు కూడా పెద్ద హెడ్‌లైన్స్‌గా మారుతుంటాయి. 56 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడి రాజకీయ వ్యూహంలో ఈ టైమింగ్ అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఇది కార్యకర్తలను సమీకరించడానికి, విజువల్స్‌తో కూడిన నిరసనలు చేయడానికి, రాత్రి వేళల్లో వచ్చే ప్రైమ్-టైమ్ న్యూస్‌లో తమ అంశాలు ట్రెండ్ అయ్యేలా చేయడానికి కాంగ్రెస్‌కు ఎంతగానో ఉపయోగపడుతోంది. టీవీలు చూసే అలవాట్లు మారుతున్నప్పటికీ, మెయిన్‌స్ట్రీమ్ మీడియా ద్వారా పొలిటికల్ నరేటివ్‌ను సెట్ చేసే శక్తి ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్‌ను దశాబ్దాలుగా గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ అభిప్రాయం ప్రకారం.. ఇది వార్తల్లో నిరంతరం కొనసాగడానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో చేస్తున్న “స్లో-బర్న్ గేమ్‌” స్ట్రాటజీ.

టైమింగ్‌ పైనే రాహుల్ దృష్టి..

రాజకీయాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా, టీవీల యుగంలో టైమింగ్ చాలా ముఖ్యం. యుపీఏ పాలనా కాలంలో (2004-2014) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగేవి. దానివల్ల ఆ వివరాలు ప్రైమ్-టైమ్ టీవీ న్యూస్‌కు అందేవి కావు, మరుసటి రోజు పేపర్లలో కూడా ఏదో అరకొర వార్తలే వచ్చేవి. కానీ గతంలో చేసిన కమ్యూనికేషన్ పొరపాట్ల నుంచి కాంగ్రెస్ ఇప్పుడు వేగంగా పాఠాలు నేర్చుకుని, తప్పులను దిద్దుకుంటోందని దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాన్ని కవర్ చేస్తున్న ఓ సీనియర్ జర్నలిస్ట్ చెబుతున్నారు. మరోవైపు, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. కాంగ్రెస్ విషయాలను కవర్ చేసే ఓ జాతీయ మీడియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారట. ఏఐసీసీ (AICC) జోక్యం పెద్దగా లేకుండానే ఈ టీమ్ ఆయన కార్యక్రమాలన్నింటినీ చూసుకుంటుందట. విజువల్స్ చూపించే పవర్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని కాంగ్రెస్‌ను దగ్గరగా పరిశీలించే మరో సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. కేవలం కెమెరాల ముందుకు రావడం మాత్రమే కాదు, ఆయన ప్రవర్తించే తీరు కూడా పూర్తిగా మారిందనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు “ఆవేశపరుడైన రాజకీయనాయకుడు” (ఇంపల్సివ్ పాలిటీషియన్) అని ముద్రపడిన రాహుల్, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో, అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు. వీధుల్లోనే ఉంటూ పోలీసు ఎదురింపులను కూడా ప్రత్యర్థులకు రాజకీయ సందేశంగా మార్చగలుగుతున్నారు.

రాహుల్ ప్రధాన వ్యూహం ఇదే..

దశాబ్దాలుగా ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలు పార్లమెంట్ వేళల ఆధారంగానే సాగేవి. పగటిపూట నాయకులు కలవడం, నినాదాలు చేయడం, ప్రెస్ మీట్ పెట్టడంతో ముగిసేవి. సాయంత్రానికి పార్లమెంట్ మకర్ ద్వార్ ముందు తీసిన విజువల్స్ వార్తల్లోంచి మాయమైపోయేవి. అయితే పరీక్షల అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన యువజన నిరసనలు, దానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు కలవడం ఈ పరిస్థితిని మార్చేశాయి. ఆందోళనకారులు అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ఇచ్చారు. అయితే.. జూలై 21న రాహుల్ ఓ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాష్టీకానికి నిరసనగా ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి ప్రధాని మోడీ నివాసం వెలుపల ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి అందరినీ నిర్బంధించే వరకు ఆ ధర్నా కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని సీజేపీ విజయంగా చెప్పుకోగా, విద్యార్థుల డిమాండ్లను దేశవ్యాప్తంగా వినిపించడంలో రాహుల్ పాత్ర కీలకంగా మారారని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు.

టీవీలు, సోషల్ మీడియాకు సరిపడా విజువల్స్..

ఆ తర్వాత ఆగస్టు 21న విద్యార్థిపై పెల్లెట్ గుళ్ల వాడకానికి నిరసనగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు రాహుల్ మరో ధర్నా చేశారు. ఇక సెప్టెంబర్ ఆఖరు, అక్టోబర్ ప్రారంభంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎలక్షన్ కమిషన్ తీరుపై ఆరోపణలు చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ ఆందోళనలను తీవ్రతరం చేశారు. అక్టోబర్ 6న ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఈసీ కార్యాలయానికి మార్చ్ నిర్వహించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోనే సుదీర్ఘంగా బైఠాయించారు. ఈ నిరసన రాత్రి వరకు సాగడంతో పాటు, నాయకుల ముందస్తు నిర్బంధాలు రాజకీయంగా పెద్ద డ్రామాను సృష్టించాయి. మరుసటి రోజే కన్నాట్ ప్లేస్‌లో లంచ్ మీటింగ్ పెట్టుకుని, జంతర్ మంతర్ వైపు మార్చ్‌కు యత్నించగా మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ రాహుల్ నాయకత్వంలో మరో మార్చ్ జరిగింది. ముద్ద ఏదైనా.. వీధిపోరాటం, పోలీసులతో ఘర్షణ, సాయంత్రానికి టీవీలు, సోషల్ మీడియాకు సరిపడా విజువల్స్ స్టోరీని అందించడం అనేది ఓ కామన్ ఫార్మాట్‌గా మారిపోయింది.

రాత్రి వరకు ఆందోళనలు..

ఓ సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ ప్రకారం.. రాహుల్ టీమ్ ఈ టైమింగ్‌ను అను అనుకోకుండా చేయట్లేదట. ప్రధాని మోడీ రోజువారీ కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకుని, వార్తా ఛానెళ్లు రాహుల్ లేవనెత్తే అంశాలను రాత్రి 6 నుంచి 9 గంటల ప్రైమ్-టైమ్ డిబేట్లలో తప్పనిసరిగా చర్చించేలా ఈ ప్లాన్ అమలు చేస్తున్నారట. దీనివల్ల సోషల్ మీడియాలో కూడా ఆయన బారికేడ్లు ఎక్కే దృశ్యాలు, నిరసన దృశ్యాలు వైరల్ అవుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు జర్నలిస్ట్ కాంగ్రెస్ వార్తలను చూసే ఓ ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్ ప్రకారం.. యువత ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నా, మీడియా కవరేజ్ ఇంకా కీలకమే. పైగా మధ్యాహ్నం తర్వాత నిరసనలు పెట్టడం వల్ల నాయకులను, కార్యకర్తలను సమీకరించడానికి, లాజిస్టిక్స్ చూసుకోవడానికి ఉదయం పూట కావలసినంత సమయం దొరుకుతుంది. అయితే మధ్యాహ్నం పూట ఆందోళనలు చేయడం కొత్తదేమీ కాదు. 1987లో బొఫోర్స్ కుంభకోణం సమయంలో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వి.పి.సింగ్ ఉదయం 6 గంటలకే ప్లాన్ చేసి, మధ్యాహ్నానికి ముజఫర్‌నగర్ వరకు వేలాది మందితో భారీ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9 లేదా 10 గంటల నుంచి కాంగ్రెస్ శ్రేణుల ఏర్పాట్లు మొదలైతే, రాహుల్ వచ్చేసరికి జన సమీకరణ పూర్తవుతుంది.

తిండిలోనూ రాజకీయం..

ఈ వీధి పోరాటాల వెనుక ఉన్న రోజువారీ రొటీన్ చూస్తే.. రాహుల్ రోజూ ఉదయాన్నే లేచి ఫాస్ట్ వాకింగ్, వర్కౌట్లు ముగించుకుని టిఫిన్ చేశాక, మొదట ప్రియాంకతో మాట్లాడతారు. ఆ తర్వాత తన సొంత టీమ్‌తో గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్ చేసి రాజకీయం, వ్యూహాలు, విజువల్స్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తారు. గతంలో కేసీ వేణుగోపాల్ వంటి నేతలు ఇతర పార్టీల సమన్వయం చూసేవారు, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా ఇండియా కూటమి నేతలకు ఫోన్ చేసి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు. ఇక ఈ రాజకీయంలో ఆహారం కూడా ఓ భాగమైంది. కన్నాట్ ప్లేస్‌లోని ఖాన్ చాచా రోల్స్, సాగర్ రత్నాలో లంచ్, మోయెట్స్ (Moets) హోటల్‌లో భోజనం చేయడం వంటివి పెద్ద ఎత్తున కవర్ అయ్యాయి. ఒక సందర్భంలో రాహుల్ ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ తాగుతూ ప్రియాంకకు కూడా ఆఫర్ చేశారు. సాగర్ రత్నాలో పనీర్ బటర్ మసాలా, సగం రొట్టె తిన్న రాహుల్, మోయెట్స్ హోటల్‌లో సుమారు 100 మంది ఇండియా కూటమి ఎంపీలతో కలిసి బాదామ్ షోర్బా, దహీ భల్లా, దాల్ మఖానీ, ఐస్‌క్రీమ్‌లతో కూడిన శాకాహార విందులో పాల్గొన్నారు. ఈ విందులు కేవలం భోజనం మాత్రమే కాకుండా, నాయకుల మధ్య ఐక్యతను చాటడానికి, రాబోయే నిరసనలపై చర్చించుకోవడానికి వేదికగా మారుతున్నాయి. ఒక క్షణం కలిసి భోజనం చేయడం, మరుసటి క్షణమే రోడ్డుపై బారికేడ్ల ముందు నిలబడడం అనేది మీడియాకు ఆసక్తికరమైన కంటెంట్‌గా మారుతోంది.

ప్రతిపక్షనేత ప్రవర్తనలో సీరియస్‌నెస్.. కానీ..

రాహుల్ గాంధీ ప్రవర్తనలో స్పష్టమైన సీరియస్‌నెస్, ఆక్రమణ ధోరణి కనిపిస్తున్నాయని, ఇవి ఆయనకు ఓ పోరాటపటిమ కలిగిన నాయకుడి ఇమేజ్‌ను తెచ్చిపెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులు కాగా, సోనియా గాంధీ కాంగ్రెస్‌ను వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తన మార్కు చూపే సమయం వచ్చిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, టీవీల్లో విజువల్స్ రావడం, సోషల్ మీడియాలో క్రేజ్ రావడం వేరు, ఆ ఆందోళనలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు, అవి ఓట్లుగా మారతాయా లేదా అనేది అసలైన ప్రశ్న. ఉదయాన్నే ఫోన్ కాల్స్, టీమ్ మీటింగ్స్, మధ్యాహ్నం నిరసనలు, పనీర్ బటర్ మసాలాలు, సాయంత్రానికి బారికేడ్లపై పోరాటాలతో రాహుల్ గాంధీ వార్తల్లో నిలిచే కొత్త పొలిటికల్ టెంప్లేట్‌ను అయితే సెట్ చేశారు గానీ.. ఈ హెడ్‌లైన్స్, ఈ హడావుడి రాబోయే ఎన్నికల్లో ఓట్లుగా మారుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com