☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

Ram Charan | చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

Ram Charan | మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే అంతకుముందే ‘పునాది రాళ్లు’ చిత్రంలో కెమెరా ముందుకు వచ్చినప్పటికీ, ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సందర్భంగా చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు
Ram Charan | చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

Ram Charan | మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే అంతకుముందే ‘పునాది రాళ్లు’ చిత్రంలో కెమెరా ముందుకు వచ్చినప్పటికీ, ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సందర్భంగా చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.48 ఏళ్ల సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు ముఖ్యంగా అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో పాత్రలు పోషించానని, అనేక విజయాలు అందుకున్నానని, అవార్డులు, గౌరవాలు పొందానని గుర్తుచేసుకున్నారు. అయితే వాటన్నింటికంటే అభిమానులు తనపై చూపించిన ప్రేమ, వారి హృదయాల్లో తనకు ఇచ్చిన స్థానం ఎంతో విలువైనవని చిరంజీవి పేర్కొన్నారు.

1978 సెప్టెంబర్ 22న మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయాలు, అవార్డులు, గౌరవాల కంటే తనపై అభిమానులు చూపించిన ప్రేమే తనకు గొప్పదని తెలిపారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఇంతటి ప్రేమాభిమానాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ‘చిరంజీవి’ అనే పేరును తాను పెట్టుకున్నప్పటికీ, దానికి శాశ్వతమైన గుర్తింపు అభిమానుల ప్రేమ వల్లే వచ్చిందని పేర్కొన్నారు.

ఇక తండ్రి చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానంపై రామ్ చరణ్ కూడా భావోద్వేగంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.నాన్నా.. మీరు సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి 48 ఏళ్లు పూర్తయ్యాయి. మీ జీవితాన్ని, మన కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసిన ఆ రోజు గురించి మేము ప్రతిరోజూ తలచుకుంటూనే ఉంటాము అంటూ రామ్ చరణ్ తన సందేశాన్ని ప్రారంభించారు. చిరంజీవి సినీ ప్రయాణానికి ప్రేక్షకులు అందించిన ప్రేమ, మద్దతుకు తాను ఎంతో రుణపడి ఉంటానని చరణ్ తెలిపారు. తండ్రి సినీ ప్రస్థానం తమ కుటుంబానికి మాత్రమే కాకుండా తనకు కూడా ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సినీ రంగంలో చిరంజీవి సాధించిన ఈ మైలురాయి 50 ఏళ్లకు చేరుకునే వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చరణ్ చెప్పడం విశేషం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తెలంగాణ బీజేపీకి మళ్లీ ఇన్చార్జిగా బన్సల్.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‎గా కమలం పార్టీ స్కెచ్Ram Charan | రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. మరోసారి తెరపైకి క్రేజీ కాంబినేషన్ టాక్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com