☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

రణబాలి మూవీ రివ్యూ

Ranabaali Review: విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పిరియాడికల్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ...
రణబాలి మూవీ రివ్యూ

Ranabaali Review: విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పిరియాడికల్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లతో మరింత హైప్ పెంచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

Read Also: Ramayana movie: రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ కొత్త ట్రైలర్ వచ్చేసింది

Ranabaali Review
Ranabali Movie Review

Ranabaali Review: కథ ఏమిటంటే?

ఈ కథ అంతా 1854 నుంచి 1878 మధ్య కాలంలో సాగుతుంది. సింగనమల గ్రామానికి చెందిన బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఆ ఊరి పాలెగాడి కుటుంబంలో జన్మిస్తాడు. ఊపిరి లేకుండా పుట్టిన రణబాలికి ఆ కుటుంబం కొంగుబంగారంగా కొలిచే భద్రమల్లన్న స్వామి ఊపిరి పోసి, రెండు పుష్కరాల (24 ఏళ్లు) ఆయుష్షును ఇస్తాడు. స్వామి దీవెనలతో పెరిగిన రణబాలి ప్రజలకు అండగా ఉంటాడు. అయితే, ఎప్పుడూ తాగుతూ బాధ్యత లేకుండా తిరిగే రణబాలికి జయమ్మ (రష్మిక)తో వివాహం జరుగుతుంది. ఆమె అతన్ని మార్చే ప్రయత్నం చేస్తుండగా, కరువు కారణంగా మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని ప్రజలు పడుతున్న కష్టాలు రణబాలి దృష్టికి వస్తాయి. ఆ తర్వాత బాధ్యత లేని యువకుడి నుంచి కరువు పీడిత ప్రజలకు అండగా నిలిచే నాయకుడిగా రణబాలి ఎలా మారాడు? బ్రిటిష్ అధికారులపై అతడు సాగించిన పోరాటం ఏమిటి? అనేదే ఈ సినిమా ముఖ్యాంశం.

విశ్లేషణ

ఒక పాలెగాడు బ్రిటిష్ అధికారులను ఎదిరించి, కరువు బారిన పడిన తన ప్రజలను ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా ప్రాథమిక కథ. పేపర్ మీద ఇది ఎంతో ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ పాయింట్ అయినప్పటికీ, దాన్ని అంతే హృద్యంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చే విషయంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. ముఖ్యంగా సినిమాలో రక్తపాతం, మితిమీరిన హింస ఎక్కువగా ఉండటం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కాస్త ఇబ్బంది పెట్టే అంశం. విజయ్ దేవరకొండ సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు, కానీ ఇందులో యాక్షన్, వైలెంట్ సీన్లు మోతాదుకు మించి ఉన్నాయి.

కథనం సాగే తీరు, సినిమా నిడివి (లెంత్) కూడా అక్కడక్కడ కాస్త ఓపికకు పరీక్ష పెడతాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నంత ప్రతికూల ప్రచారం (నెగెటివిటీ) అయితే సినిమాలో లేదు. విజయ్, రష్మికల కమర్షియల్ ఇమేజ్ కంటే.. ఒక నిజాయితీ గల చారిత్రక కథను చెప్పేందుకు దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ చేసిన హానెస్ట్ ప్రయత్నంగా ‘రణబాలి’ని చెప్పుకోవచ్చు.

నటీనటుల నటన

రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ సంపూర్ణంగా ఒదిగిపోయి జీవించాడు. తన పెర్ఫార్మెన్స్‌తో ప్రతి సీన్‌లోనూ ఆకట్టుకున్నాడు. జయమ్మగా రష్మిక మందన్న స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. భద్రమల్లన్న పాత్రలో నటుడు లాల్ రెండు, మూడు సీన్లలోనే కనిపిస్తున్నా తనదైన ఇంపాక్ట్ చూపించారు. విలన్‌గా నటించిన ‘ది మమ్మీ’ ఫేమ్ నటుడు బ్రిటిష్ అధికారిగా భయపెట్టే విలనిజం పండించారు. ఈశ్వరీ రావు, వివేక్ సాగర్, కంచరపాలెం కిషోర్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రఫీ వర్క్. 18th సెంచరీ కాలం నాటి వాతావరణాన్ని, సెట్లను అత్యంత సహజ సిద్ధంగా కళ్లకు కట్టారు. అజయ్-అతుల్ పాటలు, నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్‌కు తగ్గట్టుగా కుదిరాయి. అయితే ఎడిటింగ్ విభాగం నిడివి పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకా బెటర్‌గా ఉండేది.

ముగింపు

కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, ఒక హానెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చూడాలనుకునే వారికి ‘రణబాలి’ నచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శబరిమల వర్చువల్ క్యూ ఫీజు పెంపుఅన్నమో రామచంద్రా అనే పరిస్థితి రానుందా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com