☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం

Russia Earthquake: రష్యాలోని సుదూర ప్రాంతమైన కమ్చట్కాలో శుక్రవారం భూమి ఒక్కసారిగా కంపించింది. ఓజెర్నోవ్‌స్కీ ప్రాంతానికి సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో ఈ భారీ భూకంపం...
రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం

Russia Earthquake: రష్యాలోని సుదూర ప్రాంతమైన కమ్చట్కాలో శుక్రవారం భూమి ఒక్కసారిగా కంపించింది. ఓజెర్నోవ్‌స్కీ ప్రాంతానికి సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో ఈ భారీ భూకంపం నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:36 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా ఒక నిమిషం పాటు భూమి నిరంతరం కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీసిన జనం

భూకంప తీవ్రత కారణంగా ఇళ్లలోని వస్తువులు దానంతట అవే కదలడం, గోడలు వణకడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి చేరుకున్నారు. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రకృతి ప్రకోపంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

Russia Earthquake: సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన శాస్త్రవేత్తలు

ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జియోఫిజికల్ సర్వీస్ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ భూకంపం భూ అంతర్భాగంలో చాలా ఎక్కువ లోతులో సంభవించిందని తెలిపారు. దీనివల్ల సముద్రంలో ఎలాంటి అలల అసాధారణ కదలికలు ఉండవని, కాబట్టి సునామీ ముప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘రణబాలి’పై కిషన్ రెడ్డి ప్రశంసలుభారత్, వెస్టిండీస్ మధ్య నేడు సిరీస్ డిసైడర్.. విజయం ఎవరిదో? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com