☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Mahadev App: మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌తో 94,000 కోట్ల అక్ర‌మార్జ‌న‌

Mahadev App: మ‌హాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో దాని ప్రమోట‌ర్లు సుమారు 94,400 కోట్లు అక్ర‌మంగా ఆర్జించిన‌ట్లు ఈడీ త‌న తాజా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న‌ది. రాయ్‌పూర్ కోర్టులో ఈ విష‌యాన్ని ఈడీ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆ బెట్టింగ్ యాప్ ఇంకా ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది.
Mahadev App: మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌తో 94,000 కోట్ల అక్ర‌మార్జ‌న‌

న్యూఢిల్లీ: గ‌డిచిన ప‌దేళ్ల‌లో మ‌హాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(Mahadev App)తో సుమారు 94,400 కోట్లు అక్ర‌మంగా ఆర్జించిన‌ట్లు ఈడీ త‌న తాజా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న‌ది. రాయ్‌పూర్ కోర్టులో ఈ విష‌యాన్ని ఈడీ వెల్ల‌డించింది. ఇంకా ఆ మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. ఈ కేసులో ఆరోసారి ఈడీ త‌న ఛార్జ్‌షీట్‌ను కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టింది. మ‌నీల్యాండ‌రింగ్ కోర్టు ముందు ఆ రిపోర్టును ఉంచింది. మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సుమారు 42 మంది వ్య‌క్తులు, కంపెనీల‌కు లింకు ఉన్న‌ట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ప్ర‌మోట‌ర్లు, ప్యానెల్ స‌భ్యులు.. సెంట్ర‌ల్ ఇండియాకు చెందిన‌వార‌ని, అక్ర‌మ బెట్టింగ్ వెబ్‌సైట్ల‌తో మ‌హాదేవ్ యాప్‌ను నిర్వ‌హించిన‌ట్లు గుర్తించామ‌ని ఈడీ కోర్టులో చెప్పింది.

మ‌హాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్‌ను వాట్సాప్‌, టెలిగ్రాం, ఫేస్‌బుక్ పేజీల‌తో ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ఈడీ తెలిపింది. ఆ లింకుల‌తో వేలాది మంది యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఏపీ, బెంగాల్‌లో న‌మోదు అయిన కేసుల ఆధారంగా 2022 అక్టోబ‌ర్‌లో మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. 2019 నుంచి మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా సుమారు 80 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు తెలుస్తోంద‌ని ఈడీ పేర్కొన్న‌ది. మ‌హాదేవ్ సిస్ట‌ర్ వెబ్‌సైట్లు Skyexchange.com , Lotus365.com కూడా వేల కోట్లు ఆర్జించిన‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది. పోక‌ర్, కార్డ్ గేమ్స్‌, ఛాన్స్ గేమ్స్‌, క్రికెట్ , బ్యాడ్మింట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్ బెట్టింగ్‌ను మ‌హాదేవ్ యాప్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రోత్స‌హించారు. తీన్ ప‌త్తి, డ్రాగ‌న్ టైగ‌ర్‌, వ‌ర్చువ‌ల్ క్రికెట్ గేమ్స్ కూడా కార్డు ద్వారా ఆడుతారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలతోనే సమగ్రాభివృద్ధి’కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com