☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

దొంగదెబ్బ కొట్టేందుకే దసరా పండుగ వేళ..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా సీఎం చంద్రబాబు తీవ్ర కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై భౌతిక దాడులు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. పులివెందులలో […] The post దొంగదెబ్బ కొట్టేందుకే దసరా పండుగ వేళ.. appeared first on Adya News Telugu.
దొంగదెబ్బ కొట్టేందుకే దసరా పండుగ వేళ..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా సీఎం చంద్రబాబు తీవ్ర కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై భౌతిక దాడులు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. పులివెందులలో నామినేషన్ల సందర్భంగా పోలీసులే స్వయంగా కాల్పులు జరిపారని, రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీలు పచ్చ రౌడీలకు వంతపాడుతూ గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందుల ఘటనపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 900 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని సజ్జల వెల్లడించారు. రాయచోటిలో దాదాపు 300 మందిపై, దర్శిలో 162 మందిపై తప్పుడు సెక్షన్లు పెట్టారని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన సామాన్య నాయకులపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పోటీ చేయకుండా అడ్డుకోవడమే ఈ తప్పుడు కేసుల అసలు ఉద్దేశమని ఆరోపించారు.

కోర్టులకు సెలవులు ఉన్న సమయం చూసుకుని దొంగదెబ్బ కొట్టేందుకే దసరా పండుగ వేళ హడావుడిగా ఎన్నికలు తెచ్చారని సజ్జల ఆరోపించారు. కడప నగరంలోని 66 డివిజన్లలో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. అనేక చోట్ల నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని చెప్పారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన దయనీయ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడబోవని, భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సజ్జల హెచ్చరించారు.

The post దొంగదెబ్బ కొట్టేందుకే దసరా పండుగ వేళ.. appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘వారణాసి’ కథపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళిటైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. భారీ ఆశ చూపిన గ్యాంగ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com