☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఏటేటా రికార్డు కొడుతున్న బాలాపూర్ లడ్డూ.. ఈ సారి భారీగానే పలికిందిగా!

ఏటేటా రికార్డు కొడుతున్న బాలాపూర్ లడ్డూ.. ఈ సారి భారీగానే పలికిందిగా! Caption of Image. బాలాపూర్ గణేష్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ఖైరతాబాద్ మహాగణపతికి ఎంత పేరుందో.. దాదాపు అంత పాపులారిటీ సంపాదించింది. గణనాథుని లడ్డూ ప్రసాదం వేలంతో రికార్డులు సృష్టిస్తూ ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఎప్పట్లాగే ఈసారి కూడా గతేడాది రికార్డును అధిగమించింది. వేలంలో లడ్డూ ప్రసాదం 39 లక్షల రూపాయలు పలికింది. గతేడాది 35 లక్షల రూపాయలు పలికిన లడ్డూ ఈ సారి 39 లక్షలు పలకడం విశేషం. లడ్డూ వేలంలో 8 మంది పోటీ పడగా.. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ తమ చేతికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొంటున్నానని, ఈసారి ల
ఏటేటా రికార్డు కొడుతున్న బాలాపూర్ లడ్డూ.. ఈ సారి భారీగానే పలికిందిగా!
ఏటేటా రికార్డు కొడుతున్న బాలాపూర్ లడ్డూ.. ఈ సారి భారీగానే పలికిందిగా!

బాలాపూర్ గణేష్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ఖైరతాబాద్ మహాగణపతికి ఎంత పేరుందో.. దాదాపు అంత పాపులారిటీ సంపాదించింది. గణనాథుని లడ్డూ ప్రసాదం వేలంతో రికార్డులు సృష్టిస్తూ ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఎప్పట్లాగే ఈసారి కూడా గతేడాది రికార్డును అధిగమించింది. వేలంలో లడ్డూ ప్రసాదం 39 లక్షల రూపాయలు పలికింది. గతేడాది 35 లక్షల రూపాయలు పలికిన లడ్డూ ఈ సారి 39 లక్షలు పలకడం విశేషం.

లడ్డూ వేలంలో 8 మంది పోటీ పడగా.. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. లడ్డూ తమ చేతికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొంటున్నానని, ఈసారి లడ్డూను దక్కించుకోవడం తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

బాలాపూర్ గణేష్ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రణీత్ రెడ్డి అన్నారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం సాహెబ్‌నగర్‌కు చెందిన కాలనీవాసులు, అభిమానులు, అనుచరులు బాలాపూర్ నుంచి భారీ ర్యాలీగా డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అర్బన్ గ్రూప్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సామ ప్రణీత్ రెడ్డి తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← భారత్ 2027 వరల్డ్ కప్ ప్లాన్ ఇదేనా? రోహిత్, కోహ్లీపై గంభీర్ వ్యాఖ్యలు వైరల్!Samantha: ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ బంద్ చేయని సామ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com