రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) విడుదల వాయిదా పడింది. తొలుత ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. 2027 అక్టోబర్ 29న ‘స్పిరిట్’ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
మార్చి నుంచి అక్టోబర్‌కు.. ఫ్యాన్స్‌కు పెరిగిన వెయిటింగ్!
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందీప్.. ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు విడుదల తేదీ మార్పు నిరాశ కలిగించే విషయమే.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సినిమా 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే తాజాగా విడుదల తేదీని అక్టోబర్ 29కి మార్చడంతో అభిమానులు మరికొంతకాలం వేచి చూడాల్సి వస్తోంది. కొత్త తేదీని ప్రకటిస్తూ సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపించనున్న సందీప్?
‘స్పిరిట్’లో ప్రభాస్‌ను సందీప్ రెడ్డి వంగా ఏ తరహా పాత్రలో చూపించనున్నారన్నది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. తన సినిమాల్లో పాత్రలను తీవ్రంగా, విభిన్నంగా ఆవిష్కరించే సందీప్.. ఈసారి రెబల్ స్టార్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
Check this out........ 😊 #Spirit #InSpiritMode @TSeries @VangaPictures #IndiasBiggestSuperStar 29TH OCTOBER DIWALI 2027 💥 Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026
దీపావళి బరిలో ‘స్పిరిట్’..
2027 అక్టోబర్ 29న విడుదల కానున్న ‘స్పిరిట్’ దీపావళి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మాస్ ఇమేజ్, సందీప్ రెడ్డి వంగా టేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విడుదల తేదీ వాయిదా పడటంతో అభిమానుల నిరీక్షణ మరింత పెరిగినా.. సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈసారి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’తో ప్రభాస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.


