TG TET Results 2026: తెలంగాణలో సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన TG TET (In-Service Teachers) 2026 ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సర్వీస్ టీచర్లకు TG TET పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించారు.
Read Also :RRB ALP: రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. ALP పరీక్ష షెడ్యూల్ విడుదల
24,986 మంది దరఖాస్తు.. 22,477 మంది హాజరు

ఈ పరీక్షకు మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ మార్కులు, అర్హత స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
స్కోర్‌కార్డు ఎలా చెక్ చేసుకోవాలి?
ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు అధికారిక TG TET పోర్టల్‌లోకి వెళ్లి తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా హాల్‌టికెట్/జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్ అయి ఫలితాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఫలితాల్లో అభ్యర్థి సాధించిన మార్కులు, శాతం, అర్హత స్థితి వంటి వివరాలు కనిపిస్తాయి.
TG TET Results 2026: సర్వీస్ టీచర్లకు కీలకమైన పరీక్ష
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లకు TG TET అర్హతకు సంబంధించిన ఈ పరీక్ష కీలకంగా మారింది. గతంలో నిర్వహించిన ఇన్-సర్వీస్ TG TET పరీక్షల్లో కూడా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 26న ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను పరిశీలించి తదుపరి ప్రక్రియపై దృష్టి పెట్టనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






