houthi attack on saudi: ఓ వైపు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రగిలిపోతుంటే, మరోవైపు సౌదీ అరేబియా – హౌతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ సాయుధ బలగాలు సౌదీ అరేబియాపై మరోసారి భారీ దాడికి పాల్పడ్డాయి. సౌదీ రాజధాని రియాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ చమురు సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు హౌతీ గ్రూప్ శనివారం ప్రకటించింది.
Read Also: Smit Machchhar: స్మిత్‌ను అప్యాయంగా ముద్దు పెట్టిన దుబాయ్ ప్రిన్స్
దాడికి గల కారణమిదే?
యెమెన్ రాజధాని ‘సనా’తో పాటు ఇతర భూభాగాలపై సౌదీ అరేబియా వరుస వైమానిక దాడులకు తెగబడుతోందని, దానికి ప్రతికారంగానే ఈ దాడి చేపట్టినట్లు హౌతీలు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లోనే తమ భూభాగంపై సౌదీ బలగాలు 60కి పైగా వైమానిక దాడులు చేశాయని, దీంతో మొత్తం దాడుల సంఖ్య 1,420కి చేరిందని వారు ఆరోపించారు.

లక్ష్యం నెరవేరింది!
ఈ దాడికి సంబంధించిన వివరాలను హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ (Yahya Saree) ఒక టెలివిజన్ ప్రకటన ద్వారా వెల్లడించారు. “మేము చేపట్టిన సైనిక చర్య విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. రియాద్‌లోని ఆరామ్‌కో ప్రాంగణంలో క్షిపణులు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యాలను తాకడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం లేదా ఆరామ్‌కో యాజమాన్యం నుంచి నష్టం తీవ్రతపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also






