☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

School Holiday: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..

భాగ్యనగరంలో లంబోదరుడి వీడ్కోలు వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25న లక్షలాది మంది భక్తులు, వేల సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు కదలనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
School Holiday: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..

హైదరాబాద్‌లో కొలువుదీరిన గణనాథుల వీడ్కోలు వేడుకలకు వేళయింది. వినాయక నవరాత్రుల్లో అత్యంత కీలక ఘట్టమైన మహా నిమజ్జనోత్సవం నగరవ్యాప్తంగా అట్టహాసంగా సాగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, సాధారణ జనజీవనానికి అంతరాయం కలగకుండా చూసేందుకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 14 రెండో శనివారం నాడు వర్కింగ్ డేగా అధికారులు నిర్ణయించారు.

రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు.. నిఘా నీడలో నగరం
బాలాపూర్ లడ్డూ వేలం మొదలుకొని హుస్సేన్‌సాగర్ సహా నగరంలోని బేబీ పాండ్స్ వైపు వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు బారులు తీరనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ శోభాయాత్రను తిలకించేందుకు తరలివస్తారు. ఫలితంగా పాతబస్తీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ మార్గాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

చిన్నారుల భద్రతే పరమావధి
నిమజ్జనం రోజున ప్రధాన చౌరస్తాలన్నీ ర్యాలీలతో కిటకిటలాడుతుండటంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. స్కూల్ బస్సులు, ఆటోలు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముంది. ఈ రద్దీని, రవాణా కష్టాలను ముందుగానే పసిగట్టిన అధికారులు చిన్నారులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ సెలవు నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఆ మరుసటి రోజు స్కూళ్ల రీఓపెన్‌కు సంబంధించి ఆయా విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లు అందించే మెసేజ్‌లు, సూచనలను అనుసరించాలని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ind vs Aus: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com