☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సీజేపీ నేతల అరెస్టులపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

Arvind Kejriwal: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అభిజీత్‌ దీప్కే, అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌లను అరెస్టు చేయడంపై ఆమ్‌...
సీజేపీ నేతల అరెస్టులపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

Arvind Kejriwal: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అభిజీత్‌ దీప్కే, అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌లను అరెస్టు చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. విమానం దిగకముందే నేతలను అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ భయానికి, అసహనానికి నిదర్శనమని ఆయన ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు.

ఎమర్జెన్సీని మించిన దౌర్జన్యం

దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీని మించిన దౌర్జన వాతావరణం కొనసాగుతోందని కేజ్రీవాల్ విమర్శించారు. ఓటు చోరీ ఆరోపణలు, ప్రజాస్వామ్య హక్కులను ప్రశ్నిస్తున్న వారి గొంతును ప్రభుత్వాలు అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న వారిని ముందస్తుగా అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

Read also: Jantar Mantar 2.0: రాహుల్, కేజ్రీవాల్‌లపై నబిన్ తీవ్ర ఆరోపణలు

Arvind Kejriwal: ప్రధాని మోదీ, సీఈఐ రాజీనామా డిమాండ్

ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కేజ్రీవాల్ సంచలన డిమాండ్లు చేశారు. ఓటర్ల జాబితా మరియు ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← ఎక్కువ మందిని చంపాలనుకున్నాడు.. ఫ్లైదుబాయ్ కోపైలట్ కుట్రCJP నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీలో భారీ ట్రాఫిక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com