Local Body Elections in AP : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద సవాల్‌గా మారిందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సులభంగా పూర్తయిందని, అయితే స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక, స్థానాల కేటాయింపు కష్టతరంగా మారిందని వివరించారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also : విశాఖను చుట్టేసిన భారీ తుఫాను
ఫైనల్ చేసిన అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలి
స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలువురు నేతలకు నచ్చజెప్పి ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నించారని తెలిపారు. కూటమి తరఫున చర్చల అనంతరం ఖరారు చేసిన అభ్యర్థులే ఎన్నికల బరిలో ఉండాలని, ఇతర ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుని అధికారిక అభ్యర్థులకు సహకరించాలని ఆయన కోరారు. వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కంటే కూటమి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగితేనే కూటమి బలాన్ని నిలబెట్టుకోవచ్చనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






