☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్

డంకీ రిజల్ట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరుకోవడంతో బాద్ షా నెక్ట్స్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న క్యూరియస్ కలిగిస్తోంది. ప్రస్తుతం అతడి కాల్షీట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్. షారూఖ్ కోసం సీక్వెల్స్ వెయిట్ చేస్తున్నాయి. డాన్3 ప్రాజెక్ట్ షారూక్ నుండి […]
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్

డంకీ రిజల్ట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న షారూక్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కింగ్. ఈ ప్రాజెక్ట్ ఫినీష్ దశకు చేరుకోవడంతో బాద్ షా నెక్ట్స్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న క్యూరియస్ కలిగిస్తోంది. ప్రస్తుతం అతడి కాల్షీట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్.

షారూఖ్ కోసం సీక్వెల్స్ వెయిట్ చేస్తున్నాయి. డాన్3 ప్రాజెక్ట్ షారూక్ నుండి రణవీర్ దగ్గరకు ప్రాజెక్ట్ చేరింది. కానీ ధురంధర్ చేయనని చెప్పయడంతో మళ్లీ బాద్ షా దగ్గరకే వచ్చిందని టాక్. అయితే ఇందులో అట్లీ ఇన్వాల్వ్ అయితేనే చేస్తానని డైరెక్టర్ పర్హాన్ అక్తర్‌కు చెప్పినట్లు బాలీవుడ్ టాక్. ఎలాగో అట్లీ- షారూక్ ఖాతాలో జవాన్2 ఉండనే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ చిత్రాలు వర్కౌట్ కాకపోయినా.. షారూఖ్‌తో పఠాన్2 తీయాలని ప్లాన్ చేస్తుందట నిర్మాణ సంస్థ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిందన్నది బీటౌన్ బజ్. ఈ సీక్వెల్స్ కన్నా.. ఓ స్టెప్ ముందుంది ఫరా ఖాన్ మై హునా సీక్వెల్. రీసెంట్లీ దర్శకురాలు హింటిచ్చింది. ఇటీవలే అర్జున్ కపూర్ ఈ సినిమాను వాచ్ చేశానని.. సీక్వెల్ తీసుకురావాలంటూ దర్శకురాలికి ఇన్ స్టాలో ట్యాగ్ చేశాడు. చేద్దాం అన్నట్లుగా ఓ హింట్ ఇచ్చింది ఫరా. దీంతో షారూఖ్ నెక్ట్స్ ఆమెతోనని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ కాంబోలో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్స్. అంతేకాదు.. షారూఖ్‌లోని ఫన్ అండ్ రొమాంటిక్ యాంగిల్ సరికొత్త ప్రజెంట్ చేస్తోంది దర్శకురాలు. సో ఈ కొలబరేషన్ కోసం ఫ్యాన్స్‌ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడాలి నెక్ట్స్ కింగ్ ఖాన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..?

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్‌ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com