☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Weather Report: తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి వాతావరణశాఖ హైఅలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం బుధవారం రాత్రి తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు అతి భారీ వర్షసూచన జారీ చేసినట్లు తెలిపారు.
Weather Report: తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి వాతావరణశాఖ హైఅలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

పశ్చిమమధ్య ,దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖపట్నానికి 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇది బుధవారం రాత్రి 11-12 గంటల సమయంలో ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీర ప్రాంతలైన విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆర్టీజీఎస్‌అవేర్-విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తీవ్ర వాయుగుండంపై క్షేత్రస్థాయిలోని అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. తీవ్రవాయుగుండం తీరం దాటినప్పటికి భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరో 48 గంటలు పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం శ్రీకాకుళంలో 3, అల్లూరి 2, విశాఖ 2, పోలవరం1, అనకాపల్లిలో ఒకటి మొత్తంగా 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 4250101 సంప్రదించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

బుధవారం సాయంత్రం 7 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 88.2మిమీ, లక్ష్మీనర్సుపేటలో 73.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా పుట్రేలలో 67.6 మిమీ, రెడ్డిగూడెంలో 64.1 మిమీ, ఎ.కొండూరులో 62.8మిమీ, ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 57 మిమీ, కృష్ణా జిల్లా పెదయెరుకపాడులో 53.7మిమీ , ఎన్టీఆర్ జిల్లా కొర్లమండలో 50.7మిమీ, చందర్ల 49మిమీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 44.7మిమీ చొప్పున వర్షాలు నమోదైనట్లు వివరించారు. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన అత్యధిక వర్షపాతం వివరాలు జిల్లా వారీగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 141మిమీ, అల్లూరి జిల్లా జి.మాడుగులలో 100మిమీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 97మిమీ, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 94మిమీ, పోలవరం జిల్లా కూనవరంలో 91మిమీ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 89మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 80మిమీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 78మిమీ, కోనసీమ జిల్లా అయినవిల్లిలో 76మిమీ, మన్యం జిల్లా బలిజిపేటలో 75మిమీ చొప్పున నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మాట్లాడితే మ్యూజిక్ ఆగిపోయే టెక్నిక్ తో ఇయర్ బడ్స్ వచ్చేసాయని తెలుసా? పూర్తి వివరాలు ఇవేజర్నీ లో మొబైల్ ఛార్జింగ్ ఇట్టే అయిపోతుందా! ఈ పవర్ బ్యాంక్ ఉంటే సమస్య తీరిపోయినట్టే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com