☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

'జార్జ్'గా క్రైస్తవుడు, 'క్రిష్'గా హిందువు.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' గ్లింప్స్ అవుట్!

'జార్జ్'గా క్రైస్తవుడు, 'క్రిష్'గా హిందువు.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' గ్లింప్స్ అవుట్!
'జార్జ్'గా క్రైస్తవుడు, 'క్రిష్'గా హిందువు.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' గ్లింప్స్ అవుట్!
'జార్జ్'గా క్రైస్తవుడు, 'క్రిష్'గా హిందువు.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' గ్లింప్స్ అవుట్!

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ , సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'జార్జ్ క్రిష్' (George Krish). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ రోజు ( సెప్టెంబర్ 24, 2026 ) దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా .. 'ఫస్ట్ బూస్టర్ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్ . ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మాస్ రచ్చ లేపుతోంది.

ఈ గ్లింప్స్ చూస్తుంటే శ్రీనువైట్ల మార్క్ హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. ఇందులో శర్వానంద్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న 'జార్జ్' అనే క్రైస్తవ యువకుడిగా, 'క్రిష్' అనే హిందూ కుర్రాడిగా రెండు విభిన్నమైన ల్యాండ్‌మార్క్ క్యారెక్టర్లలో కనిపించి మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఒకే మనిషిలో ఉన్న ఈ రెండు కాంట్రాస్టింగ్ షేడ్స్ చుట్టూ తిరిగే డ్రామా, దానివల్ల వచ్చే కామెడీ సిట్యుయేషన్స్ థియేటర్లలో నవ్వుల పూయించడం పక్కాగా కనిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో మాజీ ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తుండగా, ఆమె గ్లామర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మెలోడీ అండ్ చార్ట్‌బస్టర్ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం, ఎనర్జెటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫన్ రైడ్‌కి అదనపు బూస్టింగ్ ఇస్తున్నాయి. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి హంగామా సృష్టించేందుకు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కడుపుబ్బ నవ్వించేందుకు 'జార్జ్ క్రిష్' రేసులోకి దిగుతున్నారు. పక్కా సంక్రాంతి వినోదాల విందుగా ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా వెల్లడించింది. శర్వానంద్ మార్క్ యాక్టింగ్, శ్రీనువైట్ల పవర్ ప్యాక్డ్ టైమింగ్ కలగలిసిన ఈ పండగ బ్లాక్‌బస్టర్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← ఒడియమ్మా కింగ్ చేతికి రూ.2 కోట్ల వాచ్.. కేరళలో ల్యాండైన విరాట్ కోహ్లీ: ఫోటోలు వైరల్!గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 25.. ఆరోజు ఈ తప్పులు అస్సలు చెయొద్దు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com