☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games | షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కంచుమోత.. 100 మీటర్లలో తేలిపోయిన భారత చిరుతలు..!

Asian Games : నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ (Manpreet Kaur) మెరిసింది. అంచనాలు నిలబెట్టుకున్న తను మహిళల విభాగంలో కాంస్యం కొల్లగొట్టింది.
Asian Games | షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కంచుమోత.. 100 మీటర్లలో తేలిపోయిన భారత చిరుతలు..!

Asian Games : నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ (Manpreet Kaur) మెరిసింది. అంచనాలు నిలబెట్టుకున్న తను మహిళల విభాగంలో కాంస్యం కొల్లగొట్టింది. శుక్రవారం ఫైనల్లో ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరిన మన్‌ప్రీత్ కంచు మోత మోగించింది. తద్వారా ఆసియాడ్‌ మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో భారత మహిళగా చరిత్రకెక్కింది తను. అథ్లెటిక్స్‌లో పతకం గెలుస్తారనుకున్న గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్‌(Animesh Kujur)లు 100 మీటర్ల పరుగులో తేలిపోయారు.

జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత్‌ ఖాతాలో మూడో పతకం చేరింది. షూటర్లు పసిడి వెలుగులు విరజిమ్మగా.. టేబుల్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌ టీమ్ కాంస్యం పట్టేసింది. వీరి స్ఫూర్తితో షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ పోడియం మీద సగర్వంగా నిలబడింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సత్తా చాటిన తను.. ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరింది. మూడో స్థానం సాధించి.. కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది మన్‌ప్రీత్.

అంతేకాదు.. ఈ విభాగంలో పతకం గెలిచిన మూడో భారత మహిళగా మన్‌ప్రీత్ చరిత్ర లిఖించింది. ఆమె కంటే ముందు.. బర్బరా వెబ్‌స్టర్(1951లో), కిరణ్‌ బలియన్(2023లో) కాంస్యంతో మెరిశారు. మన్‌ప్రీత్ పోడియంపై నిల్చోగా.. ఇదే విభాగంలో కృష్ణ జయశంకర్ మీనన్ 16.5 మీటర్ల దూరంతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఫైనల్ చేరలే..

పురుషుల 100 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్‌లు విఫలమయ్యారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో మెరిసిన వీరు.. సెమీస్‌లో మాత్రం నిరాశపరిచారు. గురిందెర్విర్ 10.32 సెకన్లతో ఐదో స్థానంలో నిలవగా.. అనిమేశ్ 10.38 సెకన్లతో ఏడో స్థానంలో ఉండి ఫైనల్‌ బెర్తు చేజార్చుకున్నారు. దాంతో.. ఈ ఈవెంట్‌లో భారత పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న వీరిద్దరూ ఉత్త చేతులతోనే స్వదేశం రానున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Salt Vs Sugar | ఉప్పు వ‌ర్సెస్ చ‌క్కెర‌.. గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ హాని చేస్తుంది..?CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు ప్రదానం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com