☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

India vs West Indies | ద్విశతక ధీర.. కెప్టెన్‌ గిల్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. వన్డేల్లో రెండో ద్విశతకం

క్రీడాభిమానులంతా ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టిన వేళ క్రికెట్‌ మైదానంలో టీమిండియా అదరగొట్టింది. గువాహటిలో శతకాల మోత మోగి, పాత రికార్డుల దుమ్ము దులిపి, 800కు పైగా పరుగులు నమోదైన పోరులో భారత్‌ జయభేరి మోగించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 223 నాటౌట్‌) ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ, తన కెరీర్‌లో రెండో ద్విశతకంతో చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. విండీస్‌ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని మరో 6.3 ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.
India vs West Indies | ద్విశతక ధీర.. కెప్టెన్‌ గిల్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. వన్డేల్లో రెండో ద్విశతకం
  • కెప్టెన్‌ గిల్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. వన్డేల్లో రెండో ద్విశతకం
  • రోహిత్‌ వంద
  • రెండో వన్డేలో భారత్‌ రికార్డు లక్ష్య ఛేదన

గువాహటి: క్రీడాభిమానులంతా ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టిన వేళ క్రికెట్‌ మైదానంలో టీమిండియా అదరగొట్టింది. గువాహటిలో శతకాల మోత మోగి, పాత రికార్డుల దుమ్ము దులిపి, 800కు పైగా పరుగులు నమోదైన పోరులో భారత్‌ జయభేరి మోగించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 223 నాటౌట్‌) ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ, తన కెరీర్‌లో రెండో ద్విశతకంతో చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. విండీస్‌ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని మరో 6.3 ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.

వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. గిల్‌కు తోడు రోహిత్‌ శర్మ (75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101) 35వ వన్డే సెంచరీతో కొండంత లక్ష్యం ఏమూలకూ సరిపోలేదు. తొలుత వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 405 రన్స్‌ చేసింది. ఆమిర్‌ జంగు (77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), సారథి షై హోప్‌ (94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), జాన్‌ క్యాంప్‌బెల్‌ (68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) శతకాలతో మెరుపులు మెరిపించారు. ఈ విజయంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను భారత్‌ 2-0తో దక్కించుకుంది. గిల్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది. మూడో,చివరి వన్డే శనివారం చండీగఢ్‌లో జరుగుతుంది.

Gill 200

Gill 200

కెప్టెన్‌ ధనాధన్‌..
రికార్డు ఛేదనలో ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఓపెనర్లు రోహిత్‌, గిల్‌.. తమదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టారు. హిట్‌మ్యాన్‌ మొదట్నుంచే దంచుడు మంత్రాన్ని జపిస్తే క్రీజులో కుదురుకున్నాక గిల్‌ అదే రూట్‌లోకి రావడంతో పది ఓవర్లకే భారత్‌ వికెట్లేమీ నష్టపోకుండా 92 రన్స్‌తో బలమైన పునాదిని వేసుకుంది. 32 బంతుల్లో రోహిత్‌, 38 బాల్స్‌లో గిల్‌ అర్ధ శతకాలు పూర్తయ్యాయి. హాఫ్‌ సెంచరీ తర్వాత గిల్‌ జోరు పెంచితే రోహిత్‌ కాస్త నెమ్మదించాడు. మరో ఎండ్‌లో గిల్‌.. అల్జారీ ఓవర్లో 6,4తో 90ల్లోకి వచ్చాడు. అతడే వేసిన 21వ ఓవర్లో బౌండరీతో 62 బంతుల్లోనే తన 11వ సెంచరీని నమోదుచేశాడు.

ఈ సిరీస్‌లో అతడికి ఇది వరుసగా రెండో సెంచరీ. 84 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను కార్టీ జారవిడవడంతో బతికిపోయిన రోహిత్‌.. విటెల్‌ లావెస్‌ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ సింగిల్‌తో 83 బంతుల్లో సెంచరీ పూర్తయింది. కానీ ఆ వెంటనే సీల్స్‌ ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోవడంతో 255 పరుగుల రికార్డు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్‌ పెవిలియన్‌ చేరినా కోహ్లీ (29) అండతో కెప్టెన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ద్విశతకం దిశగా సాగాడు. గిల్‌ జోరుతో 29.1 ఓవర్లకే భారత్‌ 300 రన్స్‌ చేరుకుంది. రూథర్‌ఫర్డ్‌ సూపర్‌ క్యాచ్‌తో కోహ్లీ ఔటైనా రుతురాజ్‌ (31 నాటౌట్‌) సహాయంతో గిల్‌ ద్విశతకాన్ని సాధించాడు. 117 బంతుల్లోనే అతడి డబుల్‌ సెంచరీ పూర్తవడం విశేషం.

1 వన్డేల్లో వేగంగా డబుల్‌ సెంచరీ (117 బంతుల్లో) సాధించిన ప్లేయర్‌ గిల్‌ . ఇషాన్‌ 2022లో బంగ్లాదేశ్‌పై 126 బంతుల్లో చేసిన రికార్డును బ్రేక్‌ చేశాడు.

2 వన్డేల్లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన రెండో ఆటగాడు గిల్‌. రోహిత్‌ మూడు ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

1 వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. 2013లో ఆస్ట్రేలియాపై 362 పరుగులను ఛేజ్‌ చేయడమే ఇప్పటిదాకా బెస్ట్‌.

35 వన్డేల్లో రోహిత్‌కు ఇది 35వ శతకం. ఈ ఫార్మాట్‌లో 12 వేల రన్స్‌ కూడా పూర్తి చేశాడు.

సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్‌: 50 ఓవర్లకు 405/7 (జంగూ 114, హోప్‌ 104, కుల్‌దీప్‌ 2/65, జడేజా 2/75);భారత్‌: 43.3 ఓవర్లకు 406/2 (గిల్‌ 223 నాటౌట్‌, రోహిత్‌ 101, షమార్‌ 1/52, సీల్స్‌ 1/78)

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harish rao | తెలంగాణ కరెంటు..రాజస్థాన్‌కు తాకట్టు : హరీశ్‌రావుAsian Games | చికిత అద్భుతః రెండు స్వర్ణాలతో తెలంగాణ ఆర్చర్‌ డబుల్‌ ధమాకా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com