☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు

కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ సక్సెస్ ట్రాక్ తప్పేసింది. అమరన్‌తో రూ. 300 కోట్ల హీరోగా ఎదిగాడు శివ. ధనుష్, సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఫీట్ అందుకున్నాడు. నెక్ట్స్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఇతడిలో పుష్కలంగా ఉన్నాయని ఫీలయ్యారు తమిళ తంబీలు. కట్ చేస్తే పేలవమైన స్క్రిప్ట్స్ ఎంచుకుని తన ఎదుగుదలను తనే తొక్కేసుకున్నాడు. అమరన్ తర్వాత వచ్చిన మదరాసి అండ్ పరాశక్తి ఆల్ట్రా డిజాస్టర్స్‌గా మారాయి. ఏఆర్ మురుగుదాస్ అండ్ […]
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు

కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ సక్సెస్ ట్రాక్ తప్పేసింది. అమరన్‌తో రూ. 300 కోట్ల హీరోగా ఎదిగాడు శివ. ధనుష్, సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఫీట్ అందుకున్నాడు. నెక్ట్స్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఇతడిలో పుష్కలంగా ఉన్నాయని ఫీలయ్యారు తమిళ తంబీలు. కట్ చేస్తే పేలవమైన స్క్రిప్ట్స్ ఎంచుకుని తన ఎదుగుదలను తనే తొక్కేసుకున్నాడు.

అమరన్ తర్వాత వచ్చిన మదరాసి అండ్ పరాశక్తి ఆల్ట్రా డిజాస్టర్స్‌గా మారాయి. ఏఆర్ మురుగుదాస్ అండ్ సుధాకొంగర శివకార్తీకేయన్ కేపబులిటీకి తగ్గ సినిమాలివ్వడంలో తడబడ్డారు. యాక్చువల్లీ ఈ రెండు కథలు శివ చేయాల్సింది కాదు. మదరాసి కథను షారూక్‌కు వినిపించాడు.. విజయ్ దళపతితో తీయాలనుకున్నాడు కానీ సెట్ కాలేదు. చివరకు శివకార్తీకేయన్ దగ్గరకు వచ్చింది. ఇక పరాశక్తి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్యతో పురాణనూర్ అనే పేరుతో ఎనౌన్స్ చేసింది సుధా కొంగర. కానీ ఆ ప్రాజెక్ట్ నుండి సూర్య అండ్ ఇతర టీమ్ తప్పుకోవడంతో శివకార్తీకేయన్ బలయ్యాడు. శివకార్తీకేయన్ ప్రస్తుతం సేయాన్ చేస్తున్నాడు. థాయి కిళవితో ఫ్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్‌కు ఛాన్స్ ఇచ్చాడు హీరో. వెంకట్ ప్రభుతో కూడా ఓ మూవీకి కమిటయ్యాడు. ఈ రెండు చేతిలో ఉండగానే.. ఎస్కే27 స్టార్ట్ చేశారు. పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడు. పార్కింగ్ తర్వాత రామ్ శింబుతో మూవీ ఎనౌన్స్ అయ్యింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ నచ్చక శింబు క్విటయ్యాడు. ఆ ప్లేసులో శివ బుక్కయ్యాడు. శింబు 49లో నటించాల్సిన కయాదు లోహార్.. ఇప్పుడు ఎస్కే27లో ఫిక్సైనట్లు సమాచారం. ఆల్రెడీ స్టార్ హీరోలు వద్దన్న కథతో చేతులు కాల్చుకున్నా.. శివకార్తీకేయన్ మళ్లీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఈ సారి వర్కౌట్ అవుతుందో లేదో లెట్స్ వెయిట్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దుKTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com