☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఎన్ కౌంటర్‎లో చంపేస్తారేమో.. దేనికైనా సిద్ధమే: సోనమ్ వాంగ్ చుక్

ఎన్ కౌంటర్‎లో చంపేస్తారేమో.. దేనికైనా సిద్ధమే: సోనమ్ వాంగ్ చుక్ Caption of Image. న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 24న లడఖ్‌లో నలుగురు మరణించిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను ఎన్‌కౌంటర్‎లో చంపేస్తారేమోనని భయమేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని కొందరు హెచ్చరించానని.. అయితే, ఎలాంటి పర్యవసానానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ తాను చనిపోతేనే జమ్మూ కశ్మీర్‎కు రాష్ట్ర హోదా తిరిగి కల్పిస్తారంటే దానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. లడక్ ఆందోళన సమయం
ఎన్ కౌంటర్‎లో చంపేస్తారేమో.. దేనికైనా సిద్ధమే: సోనమ్ వాంగ్ చుక్
ఎన్ కౌంటర్‎లో చంపేస్తారేమో.. దేనికైనా సిద్ధమే: సోనమ్ వాంగ్ చుక్

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 24న లడఖ్‌లో నలుగురు మరణించిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను ఎన్‌కౌంటర్‎లో చంపేస్తారేమోనని భయమేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు.

తన ప్రాణానికి ముప్పు ఉందని కొందరు హెచ్చరించానని.. అయితే, ఎలాంటి పర్యవసానానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ తాను చనిపోతేనే జమ్మూ కశ్మీర్‎కు రాష్ట్ర హోదా తిరిగి కల్పిస్తారంటే దానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

లడక్ ఆందోళన సమయంలో జరిగిన మరణాలకు అమిత్ షానే బాధ్యుడని.. ఆయన రాజీనామా చేయాల్సిందేనని తన డిమాండ్‎ను పునరుద్ఘాటించారు. భద్రతా సిబ్బంది స్థానిక యువకులపై ఏకే-47లతో సహా ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించారని.. ఆ తర్వాత వారిని దేశద్రోహులుగా ముద్ర వేశారని ఆయన ఆరోపించారు. లడక్ హింసాకాండ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రక్షణల కోసం 2025 సెప్టెంబర్ 24న జమ్మూ కశ్మీర్ ప్రజలు పెద్దఎత్తున ఆందోళణకు దిగారు. నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు, భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు యువకులు మరణించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చేయలేదు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← 6 కోట్ల వ్యాపారులకు UPI ఛార్జీల దెబ్బ.. వెనక్కి తీసుకోవాలని నిర్మలమ్మకు వ్యాపార వర్గాల విజ్ఞప్తిBada Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం లైవ్ అప్ డేట్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com