☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Arunachalam Special Trains: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. టైమ్, రూట్, బుకింగ్ వివరాలు ఇవే!

దసరా, దీపావళి, కార్తీక మాస పండగల వేళ అరుణాచలం (Arunachalam Special Trains) వెళ్లే భక్తులకు భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది.
Arunachalam Special Trains: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. టైమ్, రూట్, బుకింగ్ వివరాలు ఇవే!

Arunachalam Special Trains: దసరా, దీపావళి, కార్తీక మాస పండగల వేళ అరుణాచలం (Arunachalam Special Trains) వెళ్లే భక్తులకు భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం – తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను (07291/07292) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రయాణించేందుకు వీలుగా ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి ముందస్తు అడ్వాన్స్ రిజర్వేషన్లను కూడా రైల్వేశాఖ ప్రారంభించింది.

EPF Pension Hike: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పెరగనున్న పెన్షన్.. 51 లక్షల మందికి జాక్‌పాట్

రైళ్ల వేళలు, ప్రయాణ మార్గం:

నరసాపురం – తిరువణ్ణామలై (07291) రైలు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు నరసాపురంలో బయల్దేరి, సోమవారం ఉదయం 4:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై – నరసాపురం (07292) రైలు ప్రతి సోమవారం రాత్రి 8:00 గంటలకు బయల్దేరి, మంగళవారం ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి, వేలూరు మీదుగా ప్రయాణిస్తాయి.

కోచ్‌ల వివరాలు, రెగ్యులర్ సర్వీస్:

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో మొత్తం 23 కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సెకండ్ ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, 4 జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయి. కార్తీక మాసంలో గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నరసాపురం – తిరువణ్ణామలై (07219) ప్రత్యేక రైలును ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడపనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Vishnu Priya : సీరియ‌ల్ న‌టి విష్ణు ప్రియ కొడుకు.. అయాన్ష్ 7వ పుట్టినరోజు.. సెల‌బ్రేష‌న్స్‌ ఫోటోలు వైర‌ల్..Kayadu Lohar 80s : గులాబి పువ్వుతో ది ప్యారడైజ్ బ్యూటీ.. కయ్యదు లోహర్‌ క్యూట్ ఫోటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com