☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ganesh Visarjan: గణేష్ నిమజ్జనాల్లో వికృత చేష్టలు చేస్తే జైలుకే.. సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్.. పోలీసుల ప్రత్యేక నిఘా!

హైదరాబాద్ గణేష్ నిమజ్జన (Ganesh Visarjan)కార్యక్రమాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ganesh Visarjan: గణేష్ నిమజ్జనాల్లో వికృత చేష్టలు చేస్తే జైలుకే.. సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్.. పోలీసుల ప్రత్యేక నిఘా!

Ganesh Visarjan: హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వికృత చేష్టలు, అసభ్య ప్రవర్తనకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక పోలీసు సోషల్ మీడియా బృందాలు శోభాయాత్రలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఇప్పటికే పలు ఉల్లంఘనలను నమోదు చేశాయని, నిమజ్జనం పూర్తయిన తర్వాత లభ్యమైన డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

AP Excise Department: లిక్కర్ షాపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై రెన్యువల్ గడువు పొడిగింపు ఉండదు

నిమజ్జన మార్గాల్లో మోహరించిన షీ టీమ్స్ – 1,530 మంది అదుపులోకి:

మహిళలు, యువతుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీపీ సజ్జనార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా షీ టీమ్స్‌ను భారీగా మోహరించారు. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ (Ganesh Visarjan)మండపాలతో పాటు ప్రధాన రద్దీ ప్రాంతాలు, నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో సంచరించిన షీ టీమ్స్… ఈవ్ టీజింగ్, అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 1,530 మందిని అదుపులోకి తీసుకుని గట్టి షాక్ ఇచ్చాయి.

724 మందికి కౌన్సెలింగ్ – 48 మందికి జైలు శిక్ష:

అదుపులోకి తీసుకున్న వారిలో ప్రాథమిక వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం 724 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి తీవ్రంగా హెచ్చరించి పంపించారు. అంతేకాకుండా తీవ్రమైన వేధింపులకు పాల్పడిన మరో 48 మందిపై కేసులు నమోదు చేయగా కోర్టు ద్వారా శిక్షలు పడ్డాయి. ఉత్సవాల వేళ నగరంలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థలను, రహస్య నిఘా బృందాలను రౌండ్ ది క్లాక్ కొనసాగిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP Rains: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తర కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఆకస్మిక వరదల ముప్పు, ప్రజలు బయటకు రావొద్దన్న అధికారులు!AP Excise Department: లిక్కర్ షాపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై రెన్యువల్ గడువు పొడిగింపు ఉండదు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com