☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

AndhraPradesh : పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు

Andhra Pradesh : అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరిపైఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు.
AndhraPradesh : పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు

AndhraPradesh : ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకాగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడంతో పోలీసులు గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపారు.

Also Read : AP Elections Seat Sharing : జనసేనకు నాలుగు.. బీజేపీకి రెండు కార్పొరేషన్లు.. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. పార్టీల వారిగా లిస్ట్ ఇదే..

నామినేషన్ల దాఖలుకు వెళ్తున్న క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపైఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. దీంతోతీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవటంతో పోలీసులు ఇరువర్గీయులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి సర్ధుమణగకపోవడంతో డీఎస్పీ గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు పటిష్ఠ బందోబస్తే ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో టీడీపీ నేత మధు రాయల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆరు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కోసం మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

పుంగనూరులో నామినేషన్లకు వెళ్తతున్న క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాయచోటిలోనూ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వాహనాలకు నిప్పుంటించారు. నామినేషన్ల తొలిరోజే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Best Electric Scooters : పండక్కీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? రూ.1 లక్షలోపు టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే.. 179 కి.మీ రేంజ్SBI Loan Rates : ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. రుణ వడ్డీ రేట్ల పెంపు.. భారీగా పెరగనున్న ఈఎంఐలు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com