☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

చదువుకున్న పాఠశాలకు చేయూత

తాను చదువుకున్న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని రామగిరి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని పూర్వ విద్యార్థిగా తన బాధ్యతగా భావిస్తున్నానని వైఆర్‌పీ ఫౌండేషన్ అధినేత ఏలిశాల రవిప్రసాద్ అన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే తన సొంత నిధులతో రూ.1,50,000/- విరాళం అందించి...
చదువుకున్న పాఠశాలకు చేయూత

– రామగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల అభివృద్ధికి వైఆర్‌పీ ఫౌండేషన్ అధినేత ఏలిశాల రవిప్రసాద్ చేయూత
– మరుగుదొడ్ల నిర్మాణానికి హామీ

న‌ల్ల‌గొండ‌, సెప్టెంబ‌ర్ 25 : తాను చదువుకున్న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని రామగిరి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని పూర్వ విద్యార్థిగా తన బాధ్యతగా భావిస్తున్నానని వైఆర్‌పీ ఫౌండేషన్ అధినేత ఏలిశాల రవిప్రసాద్ అన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే తన సొంత నిధులతో రూ.1,50,000/- విరాళం అందించి పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సహకరించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వైఆర్‌పీ ఫౌండేషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని రవిప్రసాద్ ప్రకటించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. చదువు శక్తివంతమైనదని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయ‌న అన్నారు. శుక్ర‌వారం పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, వారికి అలాగే పాఠశాలకు అవసరమైన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పాఠశాలలు, విద్యార్థుల చదువులు, వారి భవిష్యత్ గురించి ఆలోచిస్తూనే ఉంటానన్నారు. పేద విద్యార్థులు 1వ తరగతి నుండి ఎంబీబీఎస్ వరకు చదువుకునేందుకు తమ ఫౌండేషన్ ద్వారా ఫీజు సహాయం అందిస్తున్న‌ట్లు చెప్పారు. భవిష్యత్‌లోనూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, పేద విద్యార్థుల చదువులకు తన వంతు సహాయం కొనసాగిస్తానని ఆయన స్ప‌ష్టం చేశారు.

నిజమైన శ్రీమంతుడు రవిప్రసాద్

ఈ సందర్భంగా 48 వ డివిజన్ కార్పొరేటర్ యామా కవిత దయాకర్ మాట్లాడుతూ, డబ్బున్న వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేసే గుణం కలిగి ఉండటం గొప్ప విషయమన్నారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తున్న రవిప్రసాద్ సేవా దృక్పథాన్ని అభినందించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావడం అభినందనీయమని, రవిప్రసాద్ సేవా దృక్పథం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యామా కవిత దయాకర్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, అడ్వకేట్ జిల్లేపల్లి రాఘవ, గుత్తా రవీందర్, గార్లపాటి పురుషోత్తం, వైఆర్‌పీ ఫౌండేషన్ టీం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి అందించిన సహకారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఏలిశాల రవిప్రసాద్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చదువుకున్న పాఠశాలకు చేయూత

చదువుకున్న పాఠశాలకు చేయూత

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harish Rao Letter | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖScheme | ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ స్కీమ్‌ను ప్రారంభించిన ఢిల్లీ యూనివర్సిటీ.. అక్టోబర్‌ 13 చివరితేదీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com