☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..

POK: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ అరాచకాలపై కాశ్మీరీ మహిళ గర్జించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POK)లో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై బారాముల్లాకు చెందిన సామాజిక-రాజకీయ కార్యకర్త తస్లీమా అఖ్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ప్రాథమిక హక్కులు కోరుతున్న ప్రజలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని ఆరోపించారు. ప్రతీ మరణంపై స్వతంత్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. జెనీవాలో జరిగి. 63వ UNHRC సమావేశంలో ఆమె మాట్లాడారు. పాక్ ఆక్రమిత […]
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..

POK: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ అరాచకాలపై కాశ్మీరీ మహిళ గర్జించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POK)లో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై బారాముల్లాకు చెందిన సామాజిక-రాజకీయ కార్యకర్త తస్లీమా అఖ్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ప్రాథమిక హక్కులు కోరుతున్న ప్రజలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని ఆరోపించారు. ప్రతీ మరణంపై స్వతంత్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

జెనీవాలో జరిగి. 63వ UNHRC సమావేశంలో ఆమె మాట్లాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ఉద్యమంపై అణచివేతపై పలు పౌరసంఘాలు, కార్యకర్తలు ప్రస్తావించారు. తస్లీమా అఖ్తర్ ‘‘అసోసియేషన్ ఆఫ్ టెర్రర్ విక్టిమ్స్ ఇన్ పాకిస్తాన్(ATVK)’’ సంబంధం ఉన్న కార్యకర్త. పీఓకేలో తమ హక్కుల్ని సాధించుకోవడానికి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమాన్ని పాక్ క్రూరంగా అణచివేసింది.

పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజల ప్రయోజనం కోసం నిజంగా పనిచేయదని, మొదట ఉగ్రవాదుల్ని పంపి జమ్మూ కాశ్మీర్‌ను శ్మశానంగా మార్చేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు నిరాయుధ, అమాయక నిరసనకారుల్ని చంపుతూ పీఓకేను శ్మశానంగా మార్చారని ఆమె అన్నారు. వేలాది మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారని, కీలక నాయకుల్ని నిర్బంధించారని, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారని ఆమె ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో సాధారణ ప్రజలు మరణించినట్లు చెప్పారు.

పీఓకే ప్రజల తరుఫున నేరుగా మాట్లాడే ప్రతినిధులు యూఎన్‌లో లేరని తస్లీమా అన్నారు. దీనికి బదులుగా లండన్‌లో ఉన్న కొందర్ని తీసుకువచ్చిన ఆ ప్రాంతంపై పాకిస్తాన్ అనుకూల కథనాలను సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. పీఓకేలో ప్రజలు తమ సమస్యల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం లేదని అన్నారు. పౌరుల హత్యలు, ప్రతీకార చర్యల్ని వెంటనే నిలిపేయాలని ఆమె డిమాండ్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో కోరారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com